Mission Start Ab
prime

Mission Start Ab

సీజన్ 1
Mission Start Ab, పోటీతో కూడుకున్న ఓ రియాల్టీ సీరీస్. ఇందులో ముగ్గురు ఉన్నతస్థాయి పెట్టుబడిదారులు పది మంది అసాధారణ ప్రారంభస్థాయి వ్యవస్థాపకులను ఎంచుకుంటారు. వీళ్ళు సీరీస్ అంతటా తమ వ్యాపార సత్తాను పరీక్షించే ఎడతెగని సవాళ్ళను ఎదుర్కొంటారు. చివరిదాకా నిలబడే వ్యవస్థాపకులకు ఓ జీవితకాల అవకాశం వస్తుంది: వారి స్టార్టప్స్‌లో పెట్టుబడి అవకాశం. ప్రతి వ్యవస్థాపకుడు కలగనేది ఈ ఒప్పందం దక్కాలంటే సర్వం ధారపోయాలి.
IMDb 7.320237 ఎపిసోడ్​లుX-Ray13+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - క్రిటిక్ సే టిక్

    18 డిసెంబర్, 2023
    59నిమి
    అన్నీ
    వ్యవస్థాపకులు తమ తొలి సవాలులో, ఓ ప్రత్యేకమైన విమర్శకుల బృందంతో తలపడతారు. తమ విజన్, వ్యాపార పటిమలతో వీళ్ళు ఈ అనుమాన పక్షులను ఒప్పించగలరా?
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - ద బిగ్ బ్రేక్

    18 డిసెంబర్, 2023
    54నిమి
    13+
    ఉత్కంఠభరితమైన సవాలుకు సిద్ధం కండి: వ్యవస్థాపకులు ఇందులో ఉన్నత స్థాయి పెట్టుబడి నిధి అధిపతిని ఒక బ్రాండ్ భాగస్వామ్యానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ మెలిక ఉంది - ఇది పరిమితకాలంలో పూర్తి చేయాల్సిన అడ్డంకుల సవాలు. ఆటంకాలు ఉన్నా వీళ్ళు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలరా?
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - స్టార్ట్ అబ్ కౌన్?

    18 డిసెంబర్, 2023
    56నిమి
    అన్నీ
    ఓ యాక్షన్ నిండిన ఘట్టంలో వ్యవస్థాపకులు ముఖాముఖి తలపడతారు! ప్రత్యేక ప్రదర్శనలు, విందులు, పోటీపడే గొంతుకల నడుమ వీళ్ళు తమ బ్రాండ్‌కు ఓ గుర్తింపును తేవడానికి పోరాడుతారు. ధ్యాస మళ్లించేవాటి పెను తుఫాను మధ్య దృష్టిని ఆకర్షించగలరా అన్నదే ప్రశ్న!
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - డూ యూ నో

    18 డిసెంబర్, 2023
    45నిమి
    7+
    భావోద్రేకాలతో వేడెక్కే ఈ సవాల్లో, వ్యవస్థాపకులు తమ బలాలను, బలహీనతలను, బలమో బలహీనతో తేల్చుకోలేని లక్షణాలను శోధిస్తారు. ఈ వ్యాపారపు రంగులరాట్నంలో స్వీయ ఎరుక, జట్టు నైపుణ్యాలే కీలకం. ఎవరి మీద పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకునే లోపు, వ్యవస్థాపకుల మూలశక్తి ఏంటో తెలుసుకోవడానికి పెట్టుబడిదారులు ప్రయత్నిస్తారు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - వర్క్ యువర్ నెట్‌వర్క్

    18 డిసెంబర్, 2023
    1 గం 1 నిమి
    13+
    తమ సెలబ్రిటీ లక్ష్యమైన రోహిత్ షెట్టీని చేరుకోవడానికి వ్యవస్థాపకులు తమ పరిచయాలను వాడుకుని, విచారించి, తెలుసుకున్న జాడలను వెంబడిస్తారు. వీళ్ళు అతన్ని చేరుకోగలరా, ఇక చేరుకున్నాక, వీళ్ళ ప్రతిపాదన అతన్ని అబ్బురపరుస్తుందా?
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - అట్రాక్టింగ్ టాలెంట్

    18 డిసెంబర్, 2023
    55నిమి
    13+
    ఈ చిట్టచివరి సవాలులో, వ్యవస్థాపకులు అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటారు‌: తమ ఆశయాలకు, సంస్కృతికి అనుగుణంగా ఓ కలల టీమ్‌ను ఏర్పరచడం. ఉద్యోగులను పనిలో పెట్టుకోవడం అనే ఎంతో రిస్కుతో కూడుకున్న ఈ ఆటలో వీళ్ళు గెలవగలరా, తమ స్టార్టప్ ప్రధాన ఆశయానికి కట్టుబడి ఉండగలరా, ముగ్గురు అసాధారణ సీఈఓ అభ్యర్థులలో ఒకరిని ఇంప్రెస్ చేయగలరా?
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ద ఫినాలే

    18 డిసెంబర్, 2023
    50నిమి
    7+
    విజన్‌లు పదునెక్కాయి, డేటా సమీక్షించబడింది, నైపుణ్యాలు పరీక్షించబడ్డాయి - అంటే అంతిమ పెట్టుబడి సంప్రదింపులకు వేదిక సిద్ధమైనట్టే. తమ సంప్రదింపుల వ్యూహాలను రూపొందించడంలో ఇటు వ్యవస్థాపకులు, అటు పెట్టుబడిదారులు తలమునకలు కావడంతో వాతావరణం ఆదుర్దాతో వేడెక్కుతుంది.
    Primeలో చేరండి