గిఫ్ట్ కార్డ్‌లతో Prime Video యాడ్-ఆన్ సబ్స్క్రిప్షన్ల కోసం చెల్లించడం
ఆస్ట్రేలియా, కెనడా మరియు మెక్సికోలోని కస్టమర్‌లు ఇప్పుడు వారి గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌ను వినియోగించి Prime Video యాడ్-ఆన్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లించవచ్చు.
మీరు ఆస్ట్రేలియా, కెనడా మరియు మెక్సికోలలో Amazon గిఫ్ట్ కార్డ్‌లను ఎంపిక చేసిన అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు Amazon వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు.
Prime సభ్యత్వం లేదా Prime Video యాడ్-ఆన్ సబ్‌స్క్రిప్షన్‌లకు సంబంధించిన సైన్-అప్ ప్రాసెస్‌లో గిఫ్ట్ కార్డ్‌ను వినియోగించే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ప్లాన్ యొక్క ఖర్చు కంటే మీ కార్డ్ యొక్క బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే, బ్యాలెన్స్ మీ ఖాతాలో అలానే ఉంటుంది మరియు ఈ కింది కాలాలలో చెల్లించడానికి వాటిని వినియోగించడం జరుగుతుంది. Amazon వెబ్‌సైట్‌లో కొనుగోళ్లు చేయడానికి కూడా బ్యాలెన్స్‌ను వినియోగించవచ్చని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు రాబోయే నెలల్లో చెల్లింపులను కవర్ చేయడానికి కావలసినంత బ్యాలన్స్ మీ వద్ద ఉందని తప్పనిసరిగా నిర్ధరించుకోవాలి.
ఉచిత ట్రయల్‌ను యాక్సెస్ చేయడానికి (అర్హత ఉంటే), మీరు బ్యాకప్ చెల్లింపు విధానంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను జోడించాలి. మీరు గిఫ్ట్ కార్డ్‌లతో మాత్రమే చెల్లిస్తున్నట్లయితే, ఉచిత ట్రయల్ అందుబాటులో ఉండదు.
మీరు ఖాతా మరియు సెట్టింగ్‌లుకు వెళ్లడం ద్వారా మీరు ఇప్పటికే ఉన్న Prime Video యాడ్-ఆన్ సబ్స్క్రిప్షన్ల కోసం చెల్లింపు విధానాలను ఎడిట్ చేయవచ్చు.