గుడ్డిదైన కాశ్మీర్ అమ్మాయి జూనీ (కాజోల్) ఢిల్లీ టూర్ గైడ్ రేహన్ కద్రీ (అమీర్ ఖాన్)ను కలుస్తుంది. ఆమె స్నేహితులు హెచ్చరించినా జూనీ రేహన్ పట్ల ఆకర్షితురాలవుతుంది. ఆమెకు జీవితాన్ని చూపించాలనుకుంటాడు రేహన్. కానీ రేహన్ మరో కోణం గురించి మరియు అది తనని నాశనం చేస్తుందనే విషయాన్ని జూనీ గ్రహించదు.