ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్స్, రూసో బ్రదర్స్ మరియు దర్శకులు రాజ్ & డీకేల సిటడెల్ ప్రపంచం నుండి ఒక ఇండియన్ సిరీస్. స్టంట్‌మాన్ బన్నీ నటి హనిని అదనపు పనికి నియమించగా, వాళ్ళు యాక్షన్, గూఢచర్యం ఇంకా ద్రోహులతో నిండిన ఎంతో ప్రమాదకర ప్రపంచంలో చిక్కుకుపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత, వారి ప్రమాదకరమైన గతం తిరిగి ఎదురైనప్పుడు, విడిపోయిన హని, బన్నీలు తమ కూతురు నాడియాను రక్షించుకోవడానికి మళ్లీ కలిసి పోరాడాలి.