


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - పానిక్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202145నిమికొత్తగా గ్యాడ్యుయేషన్ పూర్తిచేసిన సీనియర్‌లు ఈ ఏడాది న్యాయనిర్ణేతలనుంచి సంకేతంకోసం ఎదురుచూస్తుంటారు, పాతమిత్రులు కొత్త ప్రత్యర్థులు మారుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ ఆటను ఎన్నటికీ ఆడబోనని హేథర్ శపథం చేసింది. కానీ, ఒక దిగ్భ్రాంతికరమైన నమ్మకద్రోహం తర్వాత ఆమె ఆడక తప్పలేదు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - హైట్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202144నిమి23మంది ఆటగాళ్ళు రంగంలోకి దిగారు. అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పానిక్ లోని రెండో సవాలు ఆటగాళ్ళను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళింది, మరోవైపు ఈ ఆటను నిలిపేయాలని చూస్తున్న షరీఫ్, అతని డిప్యూటీలుకూడా ఆటను ఆసక్తిగా చూస్తుంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - ట్రాప్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202144నిమిజులై నాలుగో తేదీ సందర్భంగా పట్టణంలో వేడుకలు జరుగుతుంటాయి, ఒక తెప్పపైన పీడకల మొదలవుతుంది, మరోవైపు ఆటగాళ్ళను మూడో సవాల్‌కు పిలుస్తూ సూచనలు జారీ అవుతాయి. ఒక ప్రమాదకర భవనంపైన రాత్రి పూట దాడి జరుగుతుంది, కొన్ని ఆశ్చర్యకర పొత్తులు ఏర్పడటంతో హేథర్ చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - ఎస్కేప్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202149నిమిమూడో సవాల్‌లో జరిగిన కొన్ని దారుణ సంఘటనలతో ఆటగాళ్ళు ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పటం అంటే ఏమిటో అందరికీ తెలిసివచ్చింది. అదృష్టవశాత్తూ, వార్షిక క్రీడాకారుల వేడుకల కోసం ఆటగాళ్ళకు విరామం లభించింది. అయితే అక్కడ ప్రత్యర్థులమధ్య అనూహ్యంగా గొడవలు రేగటంతో కొత్త సమస్యలు ఏర్పడి మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - ఫాంటమ్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202143నిమిఒకరోజు రాత్రి ఆటగాళ్ళు స్థానికంగా ఉండే ఒక పాడుబట్ట ఇంటికి వెళతారు, అక్కడ పాత, కొత్త దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఒక పొడుపుకథ జవాబు ద్వారా ఈ ఆటకు చాలా దారుణమైన చరిత్ర ఉన్నట్లు బయటపడుతుంది. హేథర్ లక్ష్యాలు దాదాపుగా గాలిలో కలిసిపోతాయి, పానిక్ ఆటను తీవ్రంగా వ్యతిరేకించేవారిలో ఒకరికి ఆ ఆటతో ఒక రహస్య సంబంధం ఉందని అందరికీ తెలిసిపోతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - డెడ్ ఎండ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202143నిమిఏటా జరిగే డెమాలిషన్ డెర్బీ కార్యక్రమం గత ఎపిసోడ్‌లో బయటపడిన దిగ్భ్రాంతికర రహస్యాలను కొద్దిగా మరిపిస్తుంది. పోలీసులు న్యాయనిర్ణేతలను అనుసరిస్తుండటంతో ఆట కొనసాగుతుందనే నమ్మకం ఎవరికీ కలగటంలేదు. హేథర్ ఒక సంబంధాన్ని మెరుగుపరుచుకుంటుంది, మరో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటుంది, ఒక నాటకీయ ముగింపుతో ఆట కొనసాగితీరాలని నిర్ణయించబడుతుంది... కానీ అందరికీ కాదు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - ట్రస్ట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202144నిమిఆట యొక్క ఐదో సవాల్‌లో నమ్మకాలకు బీటలు వారుతుంటాయి, ఒక పాడుబడిన రైలు వంతెన నేపథ్యలో మన ఆటగాళ్ళ బండారం బయటపడుతుంది - వాళ్ళు రహస్యాలు, వాళ్ళ అబద్ధాలుకూడా. ఈ సవాల్‌తో ఆఖరి నలుగురు ఎవరో తేలిపోతుంది. ఈ నిజం మన ఆటగాళ్ళకు స్వేచ్ఛను ఇస్తుందేమోగానీ, అది వాళ్ళను వెంటాడక మానదు.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - రిటర్న్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202144నిమిఆట ఫైనలిస్టులను నిర్ధారించే నాలుగు వ్యక్తిగత సవాళ్ళలో మొదటిదానిని ప్రకటించేటప్పుడు న్యాయనిర్ణేతలు నిష్పాక్షికతను పక్కన పెడతారు. మన ఆటగాళ్ళ ఉద్దేశ్యాలు అనూహ్యరీతిలో బయటపడినప్పుడు వాళ్ళకున్న పాత పగలుకూడా బయటపడతాయి. షరీఫ్ ఒక అరెస్ట్ చేయటానికి సిద్ధమవుతుంటాడు, హేథర్‌కు తీవ్రస్థాయిలో ఆశాభంగం కలుగుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి9 - కేజెస్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202141నిమిమన నలుగురు ఫైనల్ ఆటగాళ్ళలో ఒకరు బయటకు పంపేయబడతారు, దీనితో ఒక అనూహ్య ప్రతికూల పరిణామం ఏర్పడుతుంది, ఒక నాటకీయ ఘర్షణ జరుగుతుంది. ఆటపై బయటనుంచి ఒత్తిడి పెరిగిపోతుంది, పర్యవసానాలు తీవ్రస్థాయికి చేరతాయి. ఆటకోసం సర్వశక్తులూ ఒడ్డటంవలన ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని మన ఆటగాళ్ళు కఠినమార్గంలో తెలుసుకుంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి10 - జౌస్ట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి27 మే, 202144నిమిఆట యొక్క ఆఖరి సవాల్ జౌస్ట్ ఒక సరైన విజేత గెలవటంద్వారా ముగుస్తుందనే విషయాన్ని నిరూపించాలని ఎవరో కంకణం కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది-మొత్తానికి ఎవరో ఒక వ్యక్తి పానిక్ అనే ఆటను ఇంతటితో నిలిపేయాలని ప్రయత్నిస్తున్నట్లు హేథర్ తెలుసుకుంటుంది. ఒక అదిరిపోయే ముగింపుతో ఈ ఆట శాశ్వతంగా ముగిసిపోతుంది... కనీసం అలా కనబడుతుంది. ఈ ఏడాది ఆటగాళ్ళు ఈ ఆటతో ముగిసిపోయిఉంటారేమో. కానీ వారితోనే అది ముగిసిపోదు.ఉచితంగా చూడండి