ఎపిసోడ్‌లు
సీ2 ఎపి1 - సైమన్
4 డిసెంబర్, 201856నిమిరెండవ సీజన్ ప్రీమియర్‌లో, మిడ్జ్ విదేశీ ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తూ ఉంటుంది, అదే సమయంలో ఏబ్ మరియు రోజ్ తాము ఒక నూతన ప్రపంచంలో ఉన్నట్టు తెలుసుకుంటారు. వ్యాపారంలో చెడ్డ పేరు ఉండడంతో సూసీ పలు రకాల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈలోగా జోయెల్ తన ఉద్యోగాన్ని వదులుకుని, రీగ్రూప్ అవుతాడు.ఉచితంగా చూడండిసీ2 ఎపి2 - మిడ్ టౌన్ కి మిడ్ వే
4 డిసెంబర్, 201859నిమికుటుంబానికి, స్నేహితులకు చెప్పేందుకు మిడ్జ్ కు అయిష్టత ఉన్నా, మిడ్జ్ మరియు సూసీలు కలిసి మిడ్జ్ స్టాండప్ కామెడీ వృత్తిని అభివృద్ధి చేస్తుంటారు. ఏబ్, రోజ్ లు కొత్త జీవనశైలిని ఆనందిస్తుంటారు. జోయెల్ తన తల్లిదండ్రులకు కొన్ని వ్యాపార సలహాను అందించడంతో పాటు, మిడ్జ్ తో స్థితిని సరి చేసేందుకు ప్రయత్నిస్తాడు.ఉచితంగా చూడండిసీ2 ఎపి3 - శిక్షించే గది
4 డిసెంబర్, 201849నిమితన వంక పెట్టలేని ప్రణాళికతో మిడ్జ్ మేరీకి తన ప్రత్యేక రోజున సహాయపడుతుంది. మైసెల్ & రోత్ లో ఆర్ధిక స్థితులను స్థిరంగా ఉంచడానికి జోయెల్ ప్రయత్నిస్తాడు, చివరకు అది ఒక నిధి వేటతో ముగుస్తుంది. మిడ్జ్ నటన విలసిల్లుతుంది, కానీ సూసీకి ఆర్ధికంగా నష్టం చేకూరుతుంది. కొలంబియాలో, రోజ్ క్లాసులను ఆడిట్ చేసే సమయంలో తనకు అక్కడ సౌకర్యవంతంగా లేదని గ్రహిస్తుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి4 - మేము క్యాట్‌స్కిల్స్‌కి వెళుతున్నాం!
4 డిసెంబర్, 201853నిమివార్షిక వేసవి పర్యటన కోసం వైస్మాన్ కుటుంబం క్యాట్ స్కిల్స్ కు చేరుకుంటారు, సుపరిచితమైన పరిసరాల్లో స్థిరపడేందుకు ప్రయత్నిస్తారు. మిడ్జ్ మరియు జోయెల్ వేర్పాటు గురించి గుసగుసల కారణంగా రోజ్ తన కుమార్తె ప్రేమ జీవితం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. తను, మిడ్జ్ కెరీర్లు కొనసాగడం కొరకు సూసీ తన వేసవి ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలి.ఉచితంగా చూడండిసీ2 ఎపి5 - కాన్కార్డ్ లో అర్థరాత్రి
4 డిసెంబర్, 201853నిమిమోషీ, షిర్లీలు బృందంలో చేరడంతో స్టైనర్ మౌంటెన్ రిసార్టులో వేసవి కాలం కొనసాగుతూ, ఏబ్ శాంతిని దూరం చేస్తుంది. రిసార్టులో ఎక్కువగా అందరి కంట పడకుండా ఉంటూ, తన కొత్త ఫ్రెండ్ ని దూరంగా ఉంచుతుంది సూసీ. బి.ఆల్ట్మాన్ లో తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం రావడంతో, మిడ్జ్ సంతోషిస్తుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి6 - సంగీతం మరియు నాట్యాన్ని ఎదుర్కుందాం
4 డిసెంబర్, 201849నిమిమిడ్జ్ రహస్యం ఇప్పుడు ఏబ్ కు బహిర్గతం కావడంతో, వారి మధ్య ఉద్రిక్తతలు గతంలో కంటే ఎక్కువ అవుతాయి. వేసవి చివరకు వస్తుండడంతో, సూసీ తన స్టైనర్ వ్యక్తిత్వంలో పూర్తిగా మునిగిపోతుంది, జోయెల్ బ్రహ్మచారిగా కొనసాగుతుంటారు. నోవా గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి, రోజ్ ఆస్ట్రిడ్ సున్నిత మనస్థితిని ఉపయోగించుకుంటుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి7 - చూడండి, ఆమె టోపీ చేసింది
4 డిసెంబర్, 201856నిమిన్యూయార్క్ కళని మిడ్జ్ ఆస్వాదించేలా బెంజమిన్ చేయడంతో, తను గ్రహించిన దానికంతే కళల గురించి ఎక్కువ తెలుసుకుంటుంది. జోయెల్, మిడ్జ్ వేర్పాటు వార్షికోత్సవాన మైసెల్ మరియు వైస్మాన్ కుటుంబాలు, యోమ్ కిప్పుర్ విందును ఉద్రిక్తభరిత వాతావరణంలో కలిసి చేస్తారు. ఇంతలో, తన వృత్తిని పెంపొందించడం కొరకు సూసీ తన కుటుంబాన్ని అయిష్టంగానే సహాయం కోరుతుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి8 - ఏదో ఒక రోజు
4 డిసెంబర్, 201845నిమిమిడ్జ్, సూసీ లు వారి మొదటి రోడ్డు పర్యటన కోసం సిద్ధం అయినా, ఆ పర్యటన సవాలుతో కూడుకున్నదని, అది వారి అంచనా కంటే మరింత కష్టం అని త్వరలోనే తెలుసుకుంటారు. తిరిగి న్యూయార్క్ లో, మిడ్జ్ దూరంగా ఉన్నప్పుడు వ్యాపారం సాధారణంగా ఉంటుంది, ఆమె కొత్త జీవితం, ఇంటి జీవితాన్ని త్యాగం చేసేంతటి విలువ కలదా అని మిడ్జ్ ఆలోచించవలసి వస్తుంది.ఉచితంగా చూడండిసీ2 ఎపి9 - కెన్నెడీకి వోటు వేయండి, కెన్నెడీకి వోటు వేయండి
4 డిసెంబర్, 201854నిమిటెలివిజన్లో మిడ్జ్ కి మొట్టమొదటి ప్రదర్శన సూసీ సాధిస్తుంది. అయితే వారి విజయం తాత్కాలికంగా మాత్రమే నిలుస్తుంది, ఎందుకంటే గతంలోని సంఘటనకు మిడ్జ్ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బెల్ ల్యాబ్స్ లో తన కలల ఉద్యోగం పట్ల ఏబ్ అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది, కాగా మైసెల్ & రాత్ లో జోయెల్ రాత్రుళ్ళు పనిలో మునిగిపోతుంటాడు.ఉచితంగా చూడండిసీ2 ఎపి10 - పూర్తి ఒంటరిగా
4 డిసెంబర్, 20181hఏబ్ ని మెప్పించేందుకు బెంజమిన్ ప్రయత్నిస్తుండగా, మిడ్జ్ ఇంకా రోజ్ లు మిడ్జ్ భవిష్యత్ కోసం ప్రణాళికలు రచిస్తుంటారు. జీవితంలో తన తరువాతి అంకం కొరకు జోయెల్ తీవ్రంగా కృషి చేస్తుంటాడు, అదే సమయంలో ఏబ్ సొంతంగా కొన్ని భారీ నిర్ణయాలు తీసుకుంటాడు. ఈలోగా, మిడ్జ్ కి పరిస్థితులని సానుకూలపరిచే ప్రయత్నం చేస్తుంది సూసీ.ఉచితంగా చూడండి