Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

దిల్ దోస్తీ డిలెమా

సీజన్ 1
ఒక శిక్షగా అమ్మమ్మ ఉండే ప్రాంతానికి అస్మారాను పంపడంతో ఆమె వేసవి మలుపు తిరుగుతుంది. పరువు కోసం, కెనడాలో ఉన్నట్టు ఆమె స్నేహితులకు బుకాయిస్తుంది. ఈ సాంప్రదాయ పరిసరాల్లో స్వచ్ఛమైన స్నేహాలను కనుగొంటుంది, జీవిత పాఠాలను నేర్చుకుంటుంది, కాస్త ప్రణయాన్ని రుచి చూస్తుంది. కానీ ఆమె దాస్తోన్న సత్యం అన్నిటిని పాడు చేయవచ్చు. తన నిజ వ్యక్తిత్వంతో ఉండే ధైర్యం ఆమె చేయగలదా? స్నేహం, ఎదుగుదల, మలుపుల కథకు సిద్ధం కండి!
IMDb 6.620247 ఎపిసోడ్​లు
X-RayUHD13+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - సెలవు
    24 ఏప్రిల్, 2024
    36నిమి
    13+
    అన్ని సౌకర్యాలతో పెరిగిన అస్మారా, ఆమె స్నేహితుల ముందు, ఆస్తి అంతస్తులలో తేడాల వల్ల తన సొంత అమ్మమ్మనే అమ్మమ్మ కాదంటుంది. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు ఆమె కెనడా పర్యటనను రద్దు చేసి, వేసవి సెలవులను అమ్మమ్మ, తాతయ్యలతో పాటు గడపమని వారు ఉండే నిరాడంబరమైన టిబ్రీ రోడ్‌కు ఆమెను పంపుతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - సాంస్కృతిక షాక్
    24 ఏప్రిల్, 2024
    33నిమి
    13+
    టిబ్రీ రోడ్‌లో అస్మారా తన కొత్త జీవనశైలికి సర్దుకోవడానికి ప్రయత్నిస్తుంది. పొరుగింటి పిల్ల రుక్సానాతో సంశయాత్మకంగా స్నేహం ఏర్పరచుకుంటుంది, ఫర్జాన్ కూడా తన పొరుగింటివాడేనని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. అమ్మమ్మ ఇచ్చే "ఛా పార్టీ"లో, అస్మారా ఒక దిమ్మతిరిగే ఎంట్రీ ఇచ్చి, అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - కొత్త స్నేహాలు
    24 ఏప్రిల్, 2024
    34నిమి
    13+
    "ఛా పార్టీ"లోని వివాదాస్పద సంఘటనల తర్వాత, అస్మారా అమ్మమ్మతో మళ్ళీ కలిసిపోతుంది, టిబ్రీ రోడ్ చుట్టూ జరిగే నిర్మాణ పనుల చిత్రాలను తీయడంలో తాతయ్యకు సాయపడుతుంది. తానియా తన తండ్రి ప్రకటనల ఏజెన్సీలో ధృవ్‌ను కలుస్తుంది. ఎంబ్రాయిడరీలో రుక్సానాకు ఉన్న ప్రతిభను అస్మారా తెలుసుకుని, వ్యాపారం మొదలుపెట్టేలా ఆమెకు ప్రేరణనిస్తుంది, కానీ తను కెనడాలోనే ఉన్నట్టు స్నేహితులకు అబద్ధమాడటం కొనసాగిస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - దాగిన రహస్యాలు
    24 ఏప్రిల్, 2024
    41నిమి
    13+
    అస్మారా అబద్ధాలను కనుగొన్న అమ్మమ్మ తనను కాన్నిటితో ఇంటి నుండి వెళ్లిపోమనటుంది. ఏ గమ్యం లేకుండా తిరుగుతున్న ఆమెను ఫర్జాన్ కలుస్తాడు, తిరిగి అమ్మమ్మతో కలవడంలో సాయపడతాడు. హెచ్చరికలు ఇచ్చినా, అర్మాన్ కుటిల ఉద్దేశ్యాలు గమనించకుండా నైనా అతనితోనే సమయం గడుపుతుంది. ధృవ్ సహాయంతో తానియా తన తల్లి నిజాన్ని కనుగొంటుంది. అస్మారా సందిగ్ధం వల్ల, అస్మారా, ఫర్జాన్‌ల మధ్య పెరుగుతున్న బంధం ఆటంకాలను ఎదుర్కొంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - ట్యాంకర్ రాణి
    24 ఏప్రిల్, 2024
    40నిమి
    7+
    చివరి కలయిక తర్వాత ఫర్జాన్, అస్మారాకు దూరమవుతాడు. ఓ స్ఫూర్తిదాయక ప్రసంగంతో నీటి గొడవలను పరిష్కరించడంతో అస్మారాను "ట్యాంకర్ రాణి"గా పిలుస్తారు. అనుభవంలేని అస్మారా ప్రశ్నలు తాతయ్య పునర్నిర్మాణ నమ్మకాలతో ఘర్షిస్తాయి, దీంతో ఫర్జాన్‌తో గొడవ జరుగుతుంది. ఫర్జాన్‌తో మళ్ళీ చెలిమి కుదిరి వాళ్ళు ఓ ప్రణాయత్మక క్షణాన్ని పంచుకుంటారు, దీనికి అఖ్తర్ బేగమ్ భంగం కలిగించి, ఎంతో కాలంగా దాగిన రహస్యాన్ని బయటపెడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - సంబరం
    24 ఏప్రిల్, 2024
    42నిమి
    13+
    అర్షియా, అస్మారా తిరిగి దగ్గరవుతారు, అర్మాన్ చేతిలో నైనా మోసపోతుంది, తానియా తన తల్లిదండ్రుల పరిస్థితిని కనుగొనటంతో ధృవ్‌తో ఘర్షణ ఏర్పడుతుంది. అస్మారా, ఫర్జాన్, రుక్సానాలు ఒక విందుకు హాజరవుతారు, అందులో రుక్సానాకు పెళ్ళి కుదురుతుంది. అస్మారా ఆమె కుటుంబాన్ని నిలదీస్తుంది, దాంతో ఒక విషయం బయటపడుతుంది. అబద్ధాలతో విసిగి పోయున అస్మారా కెనడా పోస్టర్లను చించి పారేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - టిబ్రీ రోడ్‌ను కాపాడటం
    24 ఏప్రిల్, 2024
    58నిమి
    13+
    అస్మారా, తానియా, నైనా తమ తమ రహస్యాలను వెలిబుచ్చడానికి ఒక దగ్గరికి చేరుకుంటారు. రుక్సానా, సుహైల్‌ల నడుమ బంధానికి ఫర్జాన్ మద్దతిస్తాడు. అస్మారా, తానియా, నైనా, వారి కుటుంబాల, స్నేహితుల సహాయం తీసుకుని, టిబ్రీ రోడ్‌ను పునర్నిర్మాణం నుండి కాపాడాలని చూస్తారు. అనుకోని ఘటనలు ఆనందం, విషాధాల మధ్య ఊగిసలాడుతాయి, టిబ్రీ రోడ్ విధిని, అమ్మాయిల భవిష్యత్తును శాసిస్తాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
పొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
हिन्दी [ऑडियो विवरण]हिन्दी
సబ్‌టైటిల్స్
Englishहिन्दी [CC]
దర్శకులు
డెబ్బీ రావ్
నిర్మాతలు
సీమా మోహాపాత్రాజహనారా భార్గవ
నటులు:
అనుష్కా సేన్కుష్ జోత్వానీతన్వి ఆజ్మి
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.