సహాయం

సమస్య పరిష్కార ప్రక్రియ

భారతదేశంలో పరికరాల పరిమితి చేరుకుంది

Prime Videoలో "మీ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ మరిన్ని డివైజ్‌లలో విక్షణ మద్దతు ఇవ్వదు" లేదా "డివైజ్‌ల పరిమితికి చేరుకున్నారు" అనే సందేశాన్ని మీరు చూసినట్లయితే ఏమి చేయాలి.

Prime Video మొబైల్ ఎడిషన్ సభ్యులు ఒక్క మొబైల్ డివైజ్‌లో మాత్రమే Prime Video కంటెంట్‌ను వీక్షించగలరు. సైన్ అప్ చేసిన తర్వాత, మీరు Prime Video కంటెంట్‌ను మొదటగా ఏ మొబైల్ డివైజ్‌లో వీక్షిస్తారో, ఆ డివైజ్ నుండి మాత్రమే మీరు కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు.

ఇండియాలోని Prime Lite సభ్యులు Prime Video కంటెంట్‌ను ఒక్క డివైజ్‌లలో మాత్రమే వీక్షించగలరు (మొబైల్ లెదా TV). సైన్ అప్ చేసిన తర్వాత, మీరు Prime Video కంటెంట్‌ను మొదటగా ఏ డివైజ్‌లో వీక్షిస్తారో, ఆ డివైజ్ నుండి మాత్రమే మీరు కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు.

భారతదేశంలో మూడవ పక్షం సర్వీస్ ప్రొవైడర్‌ల ద్వారా అందించే Prime Lite సభ్యత్వాలు ఒకటి లేదా రెండు డివైజ్‌లలో (మొబైల్ డివైజ్‌లు లేదా TV) Prime Video కంటెంట్‌ను వీక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. సైన్-అప్ సమయంలో మీరు వీక్షించగలిగే డివైజ్‌ల సంఖ్యను మీకు చూపించడం జరుగుతుంది.

భారతదేశంలోని Amazon Prime సభ్యులు రెండు టీవీలతో సహా మొత్తం ఐదు పరికరాల్లో Prime Videoను వీక్షించవచ్చు. సైన్ అప్ చేసిన తర్వాత, మీరు Prime Video కంటెంట్‌‌ను చూసే మొదటి ఐదు పరికరాలు మాత్రమే మీరు కంటెంట్‌ను యాక్సెస్ చేయగల ఏకైక పరికరాలుగా మారతాయి.

అదనపు పరికరాల్లో Prime Video కంటెంట్‌ను వీక్షించడానికి, PVME మరియు Prime Lite కస్టమర్‌లు primevideo.com/upgradeను సందర్శించడం ద్వారా మీ సభ్యత్వాన్ని అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న Prime సభ్యులు కొత్త Amazon ఖాతాలో మరొక Prime సభ్యత్వానికి సైన్ అప్ చేయవచ్చు.

మీ ప్రస్తుత డివైజ్/లను తీసివేయడానికి మరియు కొత్త డివైజ్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి, Prime Video ఖాతా మరియు సెట్టింగ్‌లు పేజీ యొక్క డివైజ్‌లు విభాగాన్ని సందర్శించండి. Prime, Prime Video మొబైల్ ఎడిషన్ లేదా Prime Lite (బ్లూ టిక్‌తో) కోసం రిజిస్టర్ చేసిన పరికరాలను గుర్తించి, "తీసివేయండి"ని ఎంపిక చేయండి. మీరు 30 రోజుల వ్యవధిలో గరిష్టంగా 2 పరికరాలను తీసివేయవచ్చు.