చేసింగ్ హ్యాపినెస్ సోదరత్వంకు సంబంధించిన కథ. న్యూ జెర్సీలో ఓ మతాధికారి కొడుకులుగా సామాన్య జీవితాలు ప్రారంభించిన యువకులు ఖ్యాతి సంపాదించి, జోనస్ బ్రదర్స్ గా సమష్టిగా ఎదిగారు - అయితే అనూహ్యంగా జో, కెవిన్ ఇంకా నిక్ బాధాకరంగా విడిపోయి భిన్న మార్గాలు ఎంచుకున్నారు. లోతయిన వ్యక్తిగత ఇంటర్వ్యూలతో, ఇంతకుముందు చూడని ఫుటేజీతో, ప్రత్యేకమైన మ్యూజిక్ తో, ఈ కథ జోనస్ బ్రదర్స్ ని ఇదివరకూ చూడని కోణంలో చూపుతుంది.