ఒక ఒంటరి తండ్రిని అలాగే చమత్కారం, వయసును మించిన వివేకం కల అతని కూతురిని అనుసరించే డాన్స్-డ్రామా చిత్రమిది. దేశంలోని అతిపెద్ద డాన్స్ రియాల్టీ షోలో ప్రదర్శన ఇవ్వాలన్న తన కూతురి కలను, జీవితాన్నే తలకిందులు చేసే ఓ సంక్షోభం ఢీకొనడంతో, తండ్రి ఒక అనూహ్యమైన పని చేయాల్సి వస్తుంది. ఆమె ఆశలు నేరవేర్చడానికి, ఆనందాన్ని కనుగొనడానికి అతను అసాధారణమైన పనులు చేస్తాడు.