ముగ్గురు ప్రఖ్యాతి చెందిన నటులైన అమీర్ ఖాన్, సైఫ్ అలి ఖాన్ మరియు అక్షయ్ ఖన్నా కలిసి నటించి బాలివుడ్ చరిత్రలో అద్భుత శృంగార భరిత కామిడి చిత్రాన్ని అందించారు. వేర్వేరు వ్యక్తిత్వాలు గల ముగ్గురు చిన్ననాటి స్నేహితుల కథ ఇది. నిజమైన ప్రేమను తెలుసుకోవటానికి ఆరాట పడుతుంటారు. ఇది ఒక హృదయానికి, ప్రేమకు సంబంధించిన కథ అని సినిమా పేరు చెబుతుంది.