


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - కుట్ర
17 డిసెంబర్, 20201 గం 12 నిమిఅది 11వ శతాబ్దపు మధ్య కాలం. లియోన్ మహారాజు ఫెర్నాండోకు పెద్ద కొడుకు అయిన యువరాజు సాంచోకు, అప్పుడే ప్రధాన అనుచరుడిగా నియమించబడ్డ యువకుడే రుయ్. ఒకరోజు రాత్రి మహారాజును పదవి నుంచి పడగొట్టే కుట్రలో తను ప్రేమించే ఒకరు భాగం అయ్యారని అతను కనుగొంటాడు. అప్పటి నుంచి, రుయ్ తన బాధ్యతలపై విశ్వాసం మరియు తన హృదయం మధ్య ఇరుక్కుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి2 - కఠిన పరీక్ష
17 డిసెంబర్, 202054నిమిఫ్లెయిన్ తను పన్నిన కుట్రను భగ్నం చేసిన వ్యక్తిని కనుగొనాలని భావిస్తాడు. అది తన మనవడే అని రోద్రిగో తెలుసుకుంటాడు, అతనిని వీవర్‌కు పంపేయాలని తలుస్తాడు. ఫ్లెయిన్ కుట్రల నేపథ్యంలో రాజును వదిలేసి వెళ్లేందుకు రుయ్ ప్రతిఘటిస్తాడు, కౌంట్‌ను అంతం చేయడమే దీనికి పరిష్కారంగా భావిస్తాడు. అంతా ప్రారంభం కానుందని అనిపించిన పరిస్థితుల్లో, నవార్రే సేనలు సరిహద్దులోకి వస్తాయి, లియోన్‌పై యుద్ధం ప్రకటిస్తాయి.Primeలో చేరండిసీ1 ఎపి3 - బరాకా
17 డిసెంబర్, 202052నిమిఆరగోన్ మహారాజు, తన సోదరుడు అయిన రామిరోతో తలపడేందుకు ఫెర్నాండో జారగోజాకు తన కుమారుడు సాంచోను చిన్న సైన్యంతో పంపుతాడు. సాంచోతో వెళ్లే ముందు, రాజును చంపాలని ఫ్లెయిన్ ప్రయత్నిస్తున్నట్లు ఆయనతోనే రుయ్ చెబుతాడు. తనకెవరు ద్రోహం చేశారో తెలుసుకోవాలని ఫెర్నాండో ప్రయత్నం ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో, లియోన్‌ను రుయ్ వదిలివెళ్లే సమయంలో, అతన్ని చంపేందుకు ఓ హంతకుడిని సేనతోనే కలిపి ఫ్లెయిన్ పంపుతాడు.Primeలో చేరండిసీ1 ఎపి4 - ఛాంపియన్
17 డిసెంబర్, 202058నిమిఆరగోనీల భారీ సైన్యంతో జరిగిన యుద్ధంలో సాంచో మరియు రుయ్ తో కలిసి కాస్టిలే సేనలు పోరాడతాయి. అంతా పోగొట్టుకున్నట్లు కనిపించిన సమయంలో, ఫలితం మాత్రం అనూహ్య స్థాయిలో వస్తుంది. లియోన్లో, తనపై కుట్ర చేసినవారిలో తన భార్య అయిన సాంచా కూడా ఉందని, ఫెర్నాండో కనుగొంటాడు. రాజుకు తెలియకుండా, అతని కూతురు ఉర్రాకా కూడా, ఎప్పటికీ అధికార సమతుల్యతను మార్చేలా ఒక నిర్ణయం తీసుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - ప్రాయశ్చిత్తం
17 డిసెంబర్, 202060నిమిఫెర్నాండోకు తీవ్రమైన అనారోగ్యం రావడంతో, సాంచో మరియు అతని సేనలు లియోన్‌కు తిరిగి వస్తాయి. తనను చంపడానికి ఫ్లెయిన్ ఒకరిని పంపాడని రుయ్ తన తాతకు చెబుతాడు. మనవడి ప్రాణం ప్రమాదంలో ఉందని రోద్రిగో తెలుసుకుంటాడు. ఫ్లెయిన్, చనిపోతున్న రాజుపై తన కుట్రను వదులుకోవడానికి ఇష్టపడడు, అలాగే ఆయన మరణానికి ముందే అధికారం దక్కించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఉర్రాకా కూడా తనవంతు పాత్ర పోషిస్తోందని అతనికి తెలియదు.Primeలో చేరండి