ఒక యువ జంట (సిడ్నీ స్వీనీ మరియు జస్టిన్ స్మిత్)కు, వీధి ఆవల ఉన్న పొరుగు జంట (బెన్ హార్డీ మరియు నటాషా లియు బోర్డిజో)ల శృంగార జీవితం ఆసక్తిగా కనిపిస్తుంది. వాళ్లలో ఒకరు తమ భాగస్వామిని మోసం చేస్తుండడంతో ఒక తెలియని ఆసక్తితో మొదలైన విషయం, హానికరమైన అలవాటుగా మారిపోతుంది. కోరిక, లొంగుబాటు కారణంగా వారి జీవితాలు కత్తి అంచున వేలాడుతూ, దారుణ పరిస్థితులకు చేరతాయి.