జస్టిన్ బీబర్: అవర్ వరల్డ్ ప్రేక్షకులకు వేదిక వెనుక సన్నివేశాలు, ఎన్‌వైఈ 2020 నూతన సంవత్సర కచేరీకి ప్రపంచ సూపర్‌స్టార్ సన్నద్ధం కావడాన్ని చూపుతుంది. బెవర్లీ హిల్టన్ హోటల్ మిద్దెపై 240 మంది అతిథులకు, లైవ్‌స్ట్రీమ్ ద్వారా కోట్లాది అభిమానులకు బీబర్ అదిరిపోయే షో ఇస్తాడు. మైకేల్ డీ. రాట్నర్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం జస్టిస్, అతని భార్య హెయిలీల సన్నిహిత సన్నివేశాలను కూడా చూపుతుంది.