Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

పానిక్

సీజన్ 1
టెక్సాస్‌లోని మారుమూల పట్టణమైన కార్ప్‌లో, పానిక్ ఆట ఒక్కటే ఆటవిడుపు. ప్రతి వేసవిలోనూ, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే సీనియర్‌లు, జీవితాలను మార్చివేసేటంత డబ్బుకోసం, ప్రాణాలు పణంగాపెట్టి కొన్ని వరస సవాళ్ళలో తలపడుతుంటారు. ఆట ఆడుతూ ఇద్దరు ఆటగాళ్ళు చనిపోవటంతో ప్రమాదస్థాయి తీవ్రంగా ఉంటుంది. ఈ వేసవిలో ఇరవైముగ్గురు ఆటలో పాల్గొనబోతున్నారు. వీళ్ళు అందరూ మారతారు. ఒక్కరుమాత్రమే గెలుస్తారు. ఇక ఆటలు మొదలవుతున్నాయి.
IMDb 6.6202110 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-PG
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పానిక్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    45నిమి
    16+
    కొత్తగా గ్యాడ్యుయేషన్ పూర్తిచేసిన సీనియర్‌లు ఈ ఏడాది న్యాయనిర్ణేతలనుంచి సంకేతంకోసం ఎదురుచూస్తుంటారు, పాతమిత్రులు కొత్త ప్రత్యర్థులు మారుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ ఆటను ఎన్నటికీ ఆడబోనని హేథర్ శపథం చేసింది. కానీ, ఒక దిగ్భ్రాంతికరమైన నమ్మకద్రోహం తర్వాత ఆమె ఆడక తప్పలేదు.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - హైట్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    44నిమి
    16+
    23మంది ఆటగాళ్ళు రంగంలోకి దిగారు. అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పానిక్ లోని రెండో సవాలు ఆటగాళ్ళను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళింది, మరోవైపు ఈ ఆటను నిలిపేయాలని చూస్తున్న షరీఫ్, అతని డిప్యూటీలుకూడా ఆటను ఆసక్తిగా చూస్తుంటారు.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - ట్రాప్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    44నిమి
    16+
    జులై నాలుగో తేదీ సందర్భంగా పట్టణంలో వేడుకలు జరుగుతుంటాయి, ఒక తెప్పపైన పీడకల మొదలవుతుంది, మరోవైపు ఆటగాళ్ళను మూడో సవాల్‌కు పిలుస్తూ సూచనలు జారీ అవుతాయి. ఒక ప్రమాదకర భవనంపైన రాత్రి పూట దాడి జరుగుతుంది, కొన్ని ఆశ్చర్యకర పొత్తులు ఏర్పడటంతో హేథర్ చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - ఎస్కేప్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    49నిమి
    16+
    మూడో సవాల్‌లో జరిగిన కొన్ని దారుణ సంఘటనలతో ఆటగాళ్ళు ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పటం అంటే ఏమిటో అందరికీ తెలిసివచ్చింది. అదృష్టవశాత్తూ, వార్షిక క్రీడాకారుల వేడుకల కోసం ఆటగాళ్ళకు విరామం లభించింది. అయితే అక్కడ ప్రత్యర్థులమధ్య అనూహ్యంగా గొడవలు రేగటంతో కొత్త సమస్యలు ఏర్పడి మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - ఫాంటమ్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    43నిమి
    16+
    ఒకరోజు రాత్రి ఆటగాళ్ళు స్థానికంగా ఉండే ఒక పాడుబట్ట ఇంటికి వెళతారు, అక్కడ పాత, కొత్త దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఒక పొడుపుకథ జవాబు ద్వారా ఈ ఆటకు చాలా దారుణమైన చరిత్ర ఉన్నట్లు బయటపడుతుంది. హేథర్ లక్ష్యాలు దాదాపుగా గాలిలో కలిసిపోతాయి, పానిక్ ఆటను తీవ్రంగా వ్యతిరేకించేవారిలో ఒకరికి ఆ ఆటతో ఒక రహస్య సంబంధం ఉందని అందరికీ తెలిసిపోతుంది.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - డెడ్ ఎండ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    43నిమి
    16+
    ఏటా జరిగే డెమాలిషన్ డెర్బీ కార్యక్రమం గత ఎపిసోడ్‌లో బయటపడిన దిగ్భ్రాంతికర రహస్యాలను కొద్దిగా మరిపిస్తుంది. పోలీసులు న్యాయనిర్ణేతలను అనుసరిస్తుండటంతో ఆట కొనసాగుతుందనే నమ్మకం ఎవరికీ కలగటంలేదు. హేథర్ ఒక సంబంధాన్ని మెరుగుపరుచుకుంటుంది, మరో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటుంది, ఒక నాటకీయ ముగింపుతో ఆట కొనసాగితీరాలని నిర్ణయించబడుతుంది... కానీ అందరికీ కాదు.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ1 ఎపి7 - ట్రస్ట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    44నిమి
    16+
    ఆట యొక్క ఐదో సవాల్‌లో నమ్మకాలకు బీటలు వారుతుంటాయి, ఒక పాడుబడిన రైలు వంతెన నేపథ్యలో మన ఆటగాళ్ళ బండారం బయటపడుతుంది - వాళ్ళు రహస్యాలు, వాళ్ళ అబద్ధాలుకూడా. ఈ సవాల్‌తో ఆఖరి నలుగురు ఎవరో తేలిపోతుంది. ఈ నిజం మన ఆటగాళ్ళకు స్వేచ్ఛను ఇస్తుందేమోగానీ, అది వాళ్ళను వెంటాడక మానదు.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ1 ఎపి8 - రిటర్న్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    44నిమి
    16+
    ఆట ఫైనలిస్టులను నిర్ధారించే నాలుగు వ్యక్తిగత సవాళ్ళలో మొదటిదానిని ప్రకటించేటప్పుడు న్యాయనిర్ణేతలు నిష్పాక్షికతను పక్కన పెడతారు. మన ఆటగాళ్ళ ఉద్దేశ్యాలు అనూహ్యరీతిలో బయటపడినప్పుడు వాళ్ళకున్న పాత పగలుకూడా బయటపడతాయి. షరీఫ్ ఒక అరెస్ట్ చేయటానికి సిద్ధమవుతుంటాడు, హేథర్‌కు తీవ్రస్థాయిలో ఆశాభంగం కలుగుతుంది.
    Freevee (యాడ్‌లతో)
  9. సీ1 ఎపి9 - కేజెస్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    41నిమి
    16+
    మన నలుగురు ఫైనల్ ఆటగాళ్ళలో ఒకరు బయటకు పంపేయబడతారు, దీనితో ఒక అనూహ్య ప్రతికూల పరిణామం ఏర్పడుతుంది, ఒక నాటకీయ ఘర్షణ జరుగుతుంది. ఆటపై బయటనుంచి ఒత్తిడి పెరిగిపోతుంది, పర్యవసానాలు తీవ్రస్థాయికి చేరతాయి. ఆటకోసం సర్వశక్తులూ ఒడ్డటంవలన ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని మన ఆటగాళ్ళు కఠినమార్గంలో తెలుసుకుంటారు.
    Freevee (యాడ్‌లతో)
  10. సీ1 ఎపి10 - జౌస్ట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    27 మే, 2021
    44నిమి
    16+
    ఆట యొక్క ఆఖరి సవాల్ జౌస్ట్ ఒక సరైన విజేత గెలవటంద్వారా ముగుస్తుందనే విషయాన్ని నిరూపించాలని ఎవరో కంకణం కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది-మొత్తానికి ఎవరో ఒక వ్యక్తి పానిక్ అనే ఆటను ఇంతటితో నిలిపేయాలని ప్రయత్నిస్తున్నట్లు హేథర్ తెలుసుకుంటుంది. ఒక అదిరిపోయే ముగింపుతో ఈ ఆట శాశ్వతంగా ముగిసిపోతుంది... కనీసం అలా కనబడుతుంది. ఈ ఏడాది ఆటగాళ్ళు ఈ ఆటతో ముగిసిపోయిఉంటారేమో. కానీ వారితోనే అది ముగిసిపోదు.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

ఆడియో భాషలు
English Dialogue Boost: LowEnglish Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschČeštinaItalianoEspañol (Latinoamérica)FrançaisPolskiMagyarPortuguêsEspañol (España)日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
రై రూసో యంగజామీ ట్రావిసవియట్ న్యూయెనమేగన్ గ్రిఫిత్సగాండ్జా మోంటిరో
నిర్మాతలు
ఆడం ష్రోడరలారెన్ ఓలివరజెఫ్ క్రిస్చెన్‌బాంజో రాతరై రూసో యంగలిన్లీ బర్డఅలీసా ఆల్ట్‌మానమార్క్ మెనైరజింజర్ స్టెడ్జఎలీ ట్రైడ్‌మానజేసన్ బి. హార్కిన్స
నటులు:
ఒలీవియా వెల్చమైక్ ఫైస్టజెస్సికా సుల
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.