టెడ్ బండీ: ఒక హంతకుడితో ప్రేమలో పడడం
freevee

టెడ్ బండీ: ఒక హంతకుడితో ప్రేమలో పడడం

సీజన్ 1
చాలా సంవత్సరాల మౌనం తరువాత, టెడ్ బండీ దీర్ఘకాల ప్రేయసి ఎలిజబెత్ కెండాల్, ఆమె కుమార్తె మాలీ, అతని బారి నుండి తప్పించుకున్నవారు మొదటిసారి బండీ చేసిన నేరాలను స్త్రీల కోణం నుండి పునరుద్ఘాటించే ఒక డాక్యుసిరీస్‌లో చెప్పబోతున్నారు. 1970ల నాటి సంస్కృతి యుద్ధాలు, స్త్రీవాద ఉద్యమంతో కలిసి బండీకి ఉన్న మహిళలపై రోగలక్షణ ద్వేషం, మన కాలంలోని అత్యంత అపఖ్యాతి పాలైన నేర కథలలో ఒకటి అని ఈ సిరీస్ వెల్లడిస్తుంది.
IMDb 7.820205 ఎపిసోడ్​లుX-RayTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - అబ్బాయి అమ్మాయిని కలుస్తాడు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 జనవరి, 2020
    49నిమి
    TV-MA
    1969-1974: ఏదైనా సాధ్యమే. స్త్రీవాద ఉద్యమం ఊపిరి పోసుకుంది, టెన్నిస్ ఆటలో బాబీ రిగ్స్‌ను బిల్లీ జీన్ కింగ్ ఓడించింది, ఒంటరి స్త్రీలలో మేరీ టైలర్ మూర్ స్ఫూర్తి నింపింది. ఒంటరి తల్లి ఎలిజబెత్ సియాటెల్‌లో తన కాళ్ళపై తాను నిలబడగలిగింది, అక్కడే లాయర్ టెడ్‌ను కలుసుకుంది. ప్రమాదం ముంచుకొస్తుంది. మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులు అదృశ్యమైపోతున్నారు, ఎలిజబెత్ కొత్త బాయ్‌ఫ్రెండ్‌లో అనూహ్యమైన మార్పు కనబడింది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ప్రేమ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 జనవరి, 2020
    49నిమి
    TV-MA
    1974: టెడ్‌కు ఊటాలోని న్యాయ కళాశాలలో సీట్ దొరుకుతుంది, కానీ అతను ఎలిజబెత్‌ను అక్కడికి తీసుకెళ్ళటానికి నిరాకరిస్తాడు. వారి సంబంధంలో కలతలు మొదలవుతాయి, దానికి కారణం తానేనని ఎలిజబెత్ నిందించుకుంటుంది. మరోవైపు, వాషింగ్టన్ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినుల అదృశ్యం కొనసాగుతుంటుంది, ఇది క్యాంపస్‌లోని విద్యార్థి పనే అయిఉండొచ్చని క్యాంపస్ పోలీస్ అధికారి చెరిల్ మార్టిన్‌కు బలంగా అనుమానం కలుగుతుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - కనిపించని అమ్మాయిలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 జనవరి, 2020
    52నిమి
    TV-MA
    1974-77: మరిన్ని అదృశ్యం కేసుల తర్వాత ఆధారాలన్నీ ఊటాలోని కళాశాలలో ఉన్న టెడ్ వైపు దారితీస్తాయి. ఈ అదృశ్యాల వెనక ఉన్న నేరస్తుడు తన బాయ్ ఫ్రెండేనా అని ఎలిజబెత్‌కు అనుమానం కలిగినప్పటికీ దానిని తోసిపుచ్చుతుంది. ఒక సమయంలో పోలీసులుకూడా అతను కాదనే అనుకుంటారు. అయితే, కిడ్నాపింగ్ నుంచి తప్పించుకున్నఒక యువతి తనపై దాడి చేసింది టెడ్ అని గుర్తించటంతో, అతనిని అరెస్ట్ చేస్తారు, దీనితో ఎలిజబెత్ పని దుర్బలమవుతుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - నీ గురించు నువ్వు ఆలోచించు, యువకుడా

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 జనవరి, 2020
    44నిమి
    TV-MA
    1978-80: టెడ్ జైలునుంచి తప్పించుకుని అజ్ఞాతంలో ఉంటాడు. ఎలిజబెత్‌కు పీడకలలు వస్తుంటాయి, తీవ్రమైన భయాలు వెంటాడతాయి; ఫ్లోరిడాలో బయటపడిన ఒక ఘోరంతో టెడ్ ఆచూకి చూచాయగా తెలుస్తుంది. పెన్సకోలా జైలునుంచి వచ్చిన ఒక టెలిఫోన్ కాల్‌తో ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది. అయితే, అమెరికా అంతా బుండీ మేనియాతో ఊగిపోతుంటుంది. అతను ఆదర్శపురుషుడా, బ్రహ్మరాక్షసుడా?
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - అదనపు నష్టం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    30 జనవరి, 2020
    37నిమి
    TV-MA
    1980-1989: ఉరిశిక్ష పడిన టెడ్ తాను అమాయకుడిని అనే చెబుతుంటాడు. ఎలిజబెత్, ఆమె కూతురు దీనినంతా మర్చిపోయి సాగిపోవటానికి ప్రయత్నిస్తారు. మరోవైపు, తన ప్రాణాలు కాపాడుకోవటంకోసం ఆఖరి ప్రయత్నంగా, టెడ్ తన నేరాలను ఒప్పుకుంటాడు. ఆతని న్యాయవాది పాలీ నెల్సన్ కుదేలైపోతాడు.
    ఉచితంగా చూడండి