


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఏసియన్ ఫ్యూజన్
11 నవంబర్, 202032నిమిఆసియా ఖండపు ఆహారంపై ప్రత్యేక బ్రిటిష్ మంత్రం వేసి జేమ్స్ తన పాకశాస్త్ర సాహసాన్ని ప్రారంభిస్తాడు. చిన్న వంట సామాను గదిలో నివసించే గృహ ఆర్థికవేత్త నిక్కీ ఆధ్వర్యంలో, కొన్ని ఊహించని పదార్థాలతో అతను ప్రయోగాలు చేస్తున్నప్పుడు (కన్)ఫ్యూజన్ చాలా ఉంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - పబ్ క్లాసిక్స్
12 నవంబర్, 202032నిమిఈ ఎపిసోడ్ కోసం సన్నాహం చేస్తూ, జేమ్స్ నిస్వార్థంగా దాదాపు నలభై సంవత్సరాల కచ్చితమైన ఫీల్డ్ వర్క్ చేశాడు. చేతిలో పెగ్గుతో, అతను చక్కని స్టీక్‌ను వేయించి, సాధారణ పై మీద ఒక మెట్రోపాలిటన్ ఉదారవాద మెలిక పెట్టి, బ్రిటిష్ వాళ్లు బాగా చేసే ఒకదాన్ని జోడిస్తాడు: అది విధ్వంసం.Primeలో చేరండిసీ1 ఎపి3 - పాస్తా
12 నవంబర్, 202029నిమిమధ్యధరా నుండి పిలుపు రాగానే, జేమ్స్ పాస్తా ప్రపంచంలోకి దూకుతాడు. ఇంటి ఆర్థికవేత్త నిక్కీ చిన్న వంట సామాను గదిలో కాకుండా, అతని వైపు ఉన్నప్పుడు, ఇతరులకన్నా కొంత ఎక్కువ సంప్రదాయకంగా అతను సంప్రదాయ ఇటాలియన్ వంటలు చేస్తాడు. పురాతన వంట సామాన్ల నుండి కార్బోనారా పాస్తా వంటకం వంటి తికమక పెట్టే సమస్యల వరకు, జేమ్స్ అపెన్నైన్ సాహసాలు చేసి, గ్లాస్ (బాటిల్) చియాంటి వైన్ తాగేస్తాడు.Primeలో చేరండిసీ1 ఎపి4 - కర్రీ
12 నవంబర్, 202028నిమిఆసియా చిహ్నం, బ్రిటిష్ వారు అభిమానించే వ్యక్తి. హోటళ్లలో దొరికే వంటలను విడమరిచి, గొర్రె కీమా, పప్పు, చపాతీలు, చిటికలో చేసిన రైతాతో కూడిన భారతీయత ఉట్టిపడే విందును చేయడానికి జేమ్స్ ప్రయత్నిస్తాడు. మన గోవా కిచెన్ హీరో సుగంధ ద్రవ్యాలను ‘డెల్లి’కేట్‌గా బ్యాలెన్స్ చేసి గృహ ఆర్థికవేత్త నిక్కీని ఆకట్టుకోగలరా?Primeలో చేరండిసీ1 ఎపి5 - పుడ్డింగ్
12 నవంబర్, 202030నిమికేకులు, కస్టర్డ్‌లు, క్రంబుల్స్ అన్నీ ఈ రోజు మెనూలో చేర్చి, అసలు విషయం పుడ్డింగ్‌లో ఉందని నిరూపించడానికి జేమ్స్ బయలుదేరాడు. నిక్కీ కాస్త సహాయం చేయడంతో, అతని విక్టోరియా స్పాంజ్ కేక్ విజయవంతమవుతుంది. అలాగే అతని యవ్వన కాలం నాటి ఆనందాలను గుర్తు చేసుకుంటూ స్పాటెడ్ డిక్ వంటకం చేస్తాడు.Primeలో చేరండిసీ1 ఎపి6 - బ్రేక్‌ఫాస్ట్
12 నవంబర్, 202029నిమిసాధారణంగా పదకొండు కంటే ముందు అల్పాహారం తీసుకోవడం ముఖ్యమని చెబుతారు. క్రమం తప్పకుండా, మంచి అల్పాహారం తింటే దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారని చెప్పడానికి జేమ్స్ ఒక సజీవ తార్కాణం. ఈ ఎపిసోడ్‌లో అతను మధ్యప్రాచ్య సంప్రదాయ వంటకం చేసి విజయవంతం అవుతాడు గాని, అది కాస్త అతనికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని అవోకాడో సైనికులను చేసి తనలోని ఆధునికతను ప్రదర్శించుకునే సమయమిది.Primeలో చేరండిసీ1 ఎపి7 - రోస్ట్
12 నవంబర్, 202028నిమిజేమ్స్ తన పాక ప్రయాణాన్ని వారాంతపు గండం, సండే రోస్ట్‌తో ముగిస్తాడు. సాధారణ టెలివిజన్ గిమ్మిక్కులు చేయకుండా, అతను సిబ్బందికి భోజనం తయారు చేస్తానని వాగ్దానం చేసిన తరువాత, ఒకే సమయంలో ప్రతిదీ సిద్ధం చేయడానికి రేసు కొనసాగుతోంది. మధ్య జీవిత సంక్షోభంలో బంగాళదుంపలు, మొలకలు, మధుర స్మృతులను ఆశించవచ్చు.Primeలో చేరండి