వైల్డ్‌క్యాట్… అమెజాన్‌లో ఒక యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. అక్కడ అతను వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని నడుపుతున్న యువతిని కలుస్తాడు. తల్లిలేని అడవి పిల్లిపిల్ల సంరక్షణ బాధ్యతలు చేపడతాడు, అందులో తన జీవితానికి కొత్త అర్థాన్ని కనుగొంటాడు. జీవిత౦ ను౦డి తప్పి౦చుకునే ప్రయత్న౦గా ఉద్దేశి౦చబడిన అతడి ప్రయాణం… ప్రేమ, ఆవిష్కరణ, స్వస్థత చేకూర్చే అనుకోని ప్రయాణ౦గా మారిపోతు౦ది.