ద ఫేక్ షేక్
prime

ద ఫేక్ షేక్

సీజన్ 1
కింగ్ ఆఫ్ ద స్టింగ్‌గా పేరు పొందిన ప్రముఖ టాబ్లాయిడ్ రిపోర్టర్ మజర్ మహ్మూద్ ఉత్కంఠ కథనమే ఈ సిరీస్. సంపన్న అరబ్ షేక్ పాత్రలా నటిస్తూ, అతను విస్తృతమైన రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తూ మోడల్స్, రాయల్స్ మరియు ఏ-జాబితా తారలను మోసం చేస్తాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు బ్రిటిష్ జర్నలిజంలో అగ్రస్థానంలో ఆయన ఉంటారు. కానీ అప్పుడు ఒక అసాధారణ పతనం తలెత్తుతుంది. మహ్మూద్ తనే మొదటి పేజీ కథగా మారిపోతాడు.
IMDb 6.320233 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎపిసోడ్ 1

    25 సెప్టెంబర్, 2023
    49నిమి
    16+
    మొనగాడైన రిపోర్టర్ మజర్ మహ్మూద్ తీవ్రమైన పోటీ ఉండే టాబ్లాయిడ్ జర్నలిజంలో తనకంటూ పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక కిరాయి హంతకుడిగా నటిస్తూ, తన ప్రియురాలు చనిపోవాలని కోరుకునే ఒక గౌరవప్రదమైన వైద్యుడి బండారం బయటపెడతాడు. కానీ నిజానికి మహ్మూద్ కోరుకునేది పెద్ద వార్త. అతను ఇద్దరు ఫుట్‌బాల్ బడాబాబుల దుష్ప్రవర్తనను బయట పెట్టడానికి, ఆడంబరమైన ధనిక అరబ్ షేక్‌గా నటించాలని పథకం వేస్తాడు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - ఎపిసోడ్ 2

    25 సెప్టెంబర్, 2023
    53నిమి
    13+
    డేవిడ్ బెకమ్ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే పన్నాగాన్ని బహిర్గతం చేయడం, ఇంగ్లండ్ మేనేజర్ స్వెన్-గొరన్ ఎరిక్‌సన్‌పై రహస్య కథనం తర్వాత నకిలీ షేక్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతాడు. కానీ మహ్మూద్ పేరు ప్రఖ్యాతులు పెరిగేకొద్దీ, అతను అనుసరిస్తున్న తీరుపై ప్రశ్నలు తలెత్తుతాయి. అతనికి కొందరు సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ఎపిసోడ్ 3

    25 సెప్టెంబర్, 2023
    50నిమి
    13+
    మజర్ మహ్మూద్‌ను అనుమానించేవారు ఉన్నా ఎవరూ ఆపలేక పోతారు. ఇంతలో న్యూస్ ఆఫ్ ది వరల్డ్ దిగ్భ్రాంతికరంగా మూతపడుతుంది. అయితే మహ్మూద్ ఎలాగో నెగ్గుకొస్తాడు. అతను ఒక కొత్త పత్రికలో చేరి, బ్రిటిష్ పాప్ స్టార్ టులీసాపై రహస్య సమాచార సేకరణ మొదలుపెడతాడు. ఆమెను పైస్థాయి డ్రగ్ డీలర్‌గా చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ ఈ కథలో మలుపు ఏమిటంటే నకిలీ షేక్‌పై విచారణ జరిగి అతని పేరు పతాక శీర్షికల్లో వస్తుంది.
    Primeలో చేరండి