సీజన్ 1
బాంబే మై బిలవెడ్ (దీనినే బంబై మేరీ జాన్ అని కూడా అంటారు) అన్న సీరీస్ గ్యాంగ్ స్టర్ దారా కాద్రీ జీవితాన్ని అతని తండ్రి, మాజీ పోలీసు ఇస్మాయిల్ కాద్రీ కళ్ళ ద్వారా చూపిస్తుంది. ఈ సీజన్లో మనం దారా తన కుటుంబంతో సహా అన్నిటినీ ఎలా పణంగా పెడతాడో చూస్తాం. అతను ఒక నిరంకుశుడైన గ్యాంగ్స్టర్ గా తయారయి, తన కుశలతతో పోలీసులతోనే కాక, ప్రత్యర్థులతో కూడా పోరాడతాడు. కానీ ఈ దోవలో తన స్వంత సమస్యలను ఎదుర్కుంటాడు.