సైన్ ఇన్

సహాయం

ఆటో ప్లేను నిర్వహించండి

ఆటో-ప్లేని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి, దీని ద్వారా మీరు టీవీ సిరీస్‌లోని ఎపిసోడ్‌లను ఒకదాని తర్వాత మరొకటి ఆటోమేటిక్‌గా తెరవచ్చు.

ప్రస్తుతం ఒక ఎపిసోడ్ ప్లే అవుతున్నప్పుడు తదుపరి ఎపిసోడ్‌ని ఆటో ప్లే చూపుతుంది, అదే సమయంలో క్రెడిట్‌లు కనిపిస్తూ ఉంటాయి.

ఆటో ప్లేను ఆన్ చేస్తే, ప్రస్తుత సిరీస్ ముగిసిన వెంటనే సిరీస్‌లోని తర్వాతి ఎపిసోడ్ తనంతతానుగా ప్లే అవుతుంది. సిరీస్‌లో ఉన్న తదుపరి ఆరు ఎపిసోడ్‌లు ఒకదాని తర్వాత మరొకటి ప్లే అవుతాయి.

Tip: తర్వాతి ఎపిసోడ్‌కు ముందుగానే వెళ్లాలనుకుంటే తదుపరిది అని కూడా ఎంచుకోవచ్చు.

మీ ఆటో ప్లే సెట్టింగ్‌లను Prime Video వెబ్‌సైట్ లేదా Android మరియు iOSలకు Prime Video యాప్‌ల నుంచి మీరు నిర్వహించుకోవచ్చు.

Prime Video వెబ్‌సైట్ నుంచి ఆటో ప్లేను నిర్వహించడానికి:

  1. ఖాతా & సెట్టింగ్‌లుకు వెళ్ళండి.
  2. ఎగువ మెనులోని ప్లేబ్యాక్ ట్యాబ్‌ను తెరవండి.
  3. ఆటోప్లేను ఆన్ లేదా ఆఫ్కు టోగుల్ చేయండి.

Prime Video యాప్ నుండి ఆటో ప్లేని నిర్వహించడం కోసం:

  1. మెను నుంచి సెట్టింగ్‌లును తెరవండి.
  2. ఆటో ప్లే ఎంపిక కోసం చూడండి.
  3. ఆటోప్లేను ఆన్ లేదా ఆఫ్కు టోగుల్ చేయండి.

ఆఫ్ చేయండి లేదా ఆటో ప్లేను దాచండి

ఆటో ప్లేను ఆఫ్ చేస్తే, ప్రస్తుతం ప్లే అవుతున్న వీడియో చివరిలో తర్వాత వచ్చేది ప్రదర్శితమవుతున్నప్పటికీ, తర్వాతి వీడియో తనంతతానుగా ప్రదర్శించడం ప్రారంభం కాదు.

వీడియో ప్లేబ్యాక్ సందర్భంగా దాచు ఎంపికను ఎంచుకోవడం ద్వారా కూడా మీరు తర్వాత వచ్చే బాక్స్ మూసివేయవచ్చు.

సంబంధిత సహాయ అంశాలు