సైన్ ఇన్

సహాయం

Prime Video నాణ్యత & ఫార్మాట్‌లు (SD, HD, UHD, HDR)

Prime Videoతో అందుబాటులో ఉన్న వీడియో నాణ్యత, ఫార్మాట్‌ల గురించి తెలుసుకోండి.

మీరు వీడియోని చూసే సమయంలో, అందుబాటులో ఉన్న మీ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌కి తగ్గట్లు బఫరింగ్‌ని తగ్గించి, ఉత్తమ నాణ్యతను అందించడం కోసం మేము ఆటోమేటిక్‌గా చిత్రం, ఆడియో నాణ్యతను సర్దుబాటు చేస్తాము. మీరు స్వీకరిస్తున్న నాణ్యతను సూచించేందుకు నోటిఫికేషన్‌లు ప్రత్యేకంగా ప్రదర్శించబడుతాయి.

Note: వీడియో వివరాలను తెరవడం ద్వారా ఒక నిర్దిష్ట శీర్షిక కోసం ఏయే ఫార్మాట్‌లు అందుబాటులో ఉన్నాయని కూడా మీరు చూడవచ్చు. మీరు ఎంచుకునే ఫార్మాట్, మీ ప్లేబ్యాక్ పరికరం, మీ ఇంటర్నెట్ కనెక్షన్‌లు వంటివి అన్నీ చిత్రం, ఆడియో నాణ్యతను ప్రభావితం చేస్తాయి.

నాణ్యత మరియు ఫార్మాట్‌లు

నాణ్యత మద్దతు కలిగిన పరికరాలు ఇంటర్నెట్ వేగం మరియు సిస్టమ్ అవసరాలు టైటిల్ లభ్యత

స్టాండర్డ్ డెఫినిషన్ (SD)

DVDల వంటి రిజల్యూషన్‌నే అందిస్తుంది మరియు CD నాణ్యత వంటి MPEG డిజిటల్ స్టీరియో సౌండ్‌ని ఉపయోగిస్తుంది.

Prime Video అనుకూల పరికరాలు అన్నీ SD వీడియో ప్లేబ్యాక్‌కు మద్దతునిస్తాయి. SD వీడియోకు HD మరియు 4K Ultra HD సహా అధిక నాణ్యత ఫార్మాట్‌లకు అవసరమైనంత ఇంటర్నెట్ కనెక్షన్ వేగం అవసరం ఉండదు. అన్ని Prime Video శీర్షికలనూ SDలో చూడవచ్చు.

హై డెఫినిషన్ (HD)

గరిష్టంగా 1080P డిస్‌ప్లే రిజల్యూషన్‌లతో అధిక నాణ్యత గల చిత్రాన్ని అందిస్తుంది ఇది Blu-ray డిస్క్ చూసినట్లే ఉంటుంది. HD వీడియో మెరుగుపరచిన సౌండ్ అనుభవం, 5.1 మల్టీ ఛానెల్ ఆడియో ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది (అందుబాటు శీర్షికలు, మరియు అనుకూలిత సౌండ్ పరికరం కోసం).

అత్యంత అనుకూలిత పరికరాలలో మీరు Prime Video శీర్షికలను HDలో వీక్షించవచ్చు. స్మూత్ ప్లేబ్యాక్ ‌కోసం HD వీడియోకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. HDలో వీక్షించేందుకు దాదాపుగా అన్ని Prime Video శీర్షికలు అందుబాటులో ఉన్నాయి.

అల్ట్రా హై డెఫినిషన్ (4K లేదా UHD)

HD కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా "4K" చిత్రం రిసొల్యూషన్‌ను అందిస్తుంది.

ఈ సమయంలో, UHD ప్లేబ్యాక్‌కు కింది పరికరాలలో మద్దతు ఉంటుంది:

 • Samsung అల్‌ట్రా HD టీవీలు (2015 లేదా ఆ తర్వాతి మోడల్‌లు)
 • Sony అల్‌ట్రా HD టీవీ (2015 లేదా ఆ తర్వాతి మోడల్‌లు)
 • LG అల్‌ట్రా HD టీవీలు (2015 లేదా ఆ తర్వాతి మోడల్‌లు)

UHD లో వీడియోలను వీక్షించడానికి మీరు కనీసం 15 Mbps వేగంతో కూడిన ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉండాలి.

మీ అనుకూలిత అల్ట్రా HD టీవీకి ఫర్మ్‌వేర్‌ను తాజా వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. మరింత సమాచారం కోసం, మీ పరికర ఫర్మ్‌వేర్ అప్‌డేట్ గురించికు వెళ్ళండి.

మీ పరికరం UHDలో ప్లేబ్యాక్‌కు మద్దతునిస్తే, UHDలో అందించే టైటిళ్లను బ్రౌజ్ చేయడానికి Prime Video యాప్ హోమ్ స్క్రీన్‌లో అల్ట్రా HD విభాగం కోసం చూడండి.

మా 4K అల్ట్రా HD చలనచిత్రాలు మరియు టీవీ షోల ఎంపికను విస్తరించడాన్ని కొనసాగిస్తున్నాము కానీ అన్ని Prime Video శీర్షికలు ఈ ఫార్మాట్‌లో ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

హై డైనమిక్ రేంజ్ (HDR)

హైలైట్‌లు మరియు షాడోల మధ్య పెంచిన వర్ణశ్రేణి మరియు వర్ణభేదాన్ని గణనీయంగా పెంచే ఫీచర్ ఉంది. ఇది మరింత వైవిధ్యంగా, ప్రత్యక్షంగా జరుగుతున్నట్టు ఉండేలా చిత్రం నాణ్యతను అందిస్తుంది.

ఈ సమయంలో, HDR వీడియో కింది పరికరాలలో అందుబాటులో ఉంది:

 • Samsung SUHD టీవీలు (2015 లేదా ఆ తర్వాత ఎంపిక చేసిన మోడల్‌లు)
 • Sony అల్‌ట్రా HD టీవీ (2015 లేదా ఆ తర్వాతి మోడల్‌లు)
 • LG OLED మరియు సూపర్ UHD టీవీలు (2015 లేదా ఆ తర్వాత ఎంపిక చేసిన మోడల్‌లు)

HDR వీడియోను వీక్షించడానికి మీ పరికర సాఫ్ట్‌వేర్ లేదా Prime Video యాప్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు.

మరింత సమాచారం కోసం, మీ పరికర ఫర్మ్‌వేర్ అప్‌డేట్ గురించికు వెళ్ళండి.

Prime Video నుంచి HDR శీర్షికలు రెండు ఫార్మాట్‌లలో ఉంటాయి:

 • HDR

  - HDR శీర్షికలు వీడియో వివరాల్లో "HDR" లేబుల్‌ను కలిగి ఉంటాయి.

 • Dolby Vision

  - నిర్షిష్ట HDR శీర్షికలలో Dolby Vision, అంటే Dolby Labs HDR స్టాండర్డ్ ఉంటుంది. ఈ టైటిళ్ల కోసం "HDR" లేబుల్‌కు బదులు వీడియో వివరాల్లో ఒక "Dolby Vision" చిహ్నాన్ని చూపిస్తుంది.

 • HDR10+

  - ఎంపిక చేసిన UHD శాంసంగ్ టీవీలు (2017 మరియు తర్వాతి మోడల్‌లు) Amazon వీడియో కంటెంట్‌ను HDR10+ ఫార్మాట్‌లో స్ట్రీమ్ చేయవచ్చు. మీ టెలివిజన్ అనుకూలితంగా ఉండి, Amazon వీడియో టైటిల్ దానికి మద్దతు ఇస్తే, వీడియో వివరాల్లో సాధారణ "HDR" లేబుల్‌కు బదులు ఒక "HDR10+" లేబుల్ కనిపిస్తుంది.

Note: Prime Video ఎంపిక చేసిన 2016 LG టీవీ మోడల్‌లలో డాలబి విజన్‌కు మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ, ఇతర HDR-అనుకూలత పరికరాలలో స్టాండర్డ్ HDR ఫార్మాట్‌లో వీక్షించానికి కూడా Dolby Vision‌లో అందించే శీర్షికలు అందుబాటులో ఉన్నాయి.

మా HDR చలన చిత్రాలు మరియు టీవీ షోల ఎంపికను విస్తరించడాన్ని మేము కొనసాగిస్తున్నాము కానీ అన్ని Prime Video శీర్షికలు ప్రస్తుతం ఈ ప్లేబ్యాక్ ఎంపికలతో అందుబాటులో లేవు.

మీ పరికరాలలో మద్దతు కలిగిన వీడియో ఫార్మాట్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడికి వెళ్లండి

సంబంధిత సహాయ అంశాలు