సైన్ ఇన్

సహాయం

Prime Video ఎర్రర్ కోడ్‌లు మరియు సమస్యలు

Prime Video వీక్షించడంలో మీకు ఏదైనా సమస్య ఏర్పడితే లేదా స్క్రీన్‌పైన ఎర్రర్ సందేశం కనిపిస్తే, మీకు సహాయపడగల కొన్ని పరిష్కారాలు కింద ఉన్నాయి.

ప్రసారం & ప్లేబ్యాక్ ఎర్రర్‌లు

ఎర్రర్ కోడ్లు: 1007, 1022, 7003, 7005, 7031, 7202, 7203, 7204, 7202, 7206, 7207, 7230, 7235, 7250, 7251, 7301, 7303, 7305, 7306, 8020, 9003, 9074

Prime Video సేవకు కనెక్ట్ చేయడంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఈ ఎర్రర్లు సంభవిస్తాయి.

ఉమ్మడి కనెక్షన్ సమస్యలను పరష్కరించానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి:

 • మీ పరికరాన్ని పునఃప్రారంభించండి - అత్యంత సాధారణంగా ఏర్పడే కనెక్టివిటీ సమస్యల కోసం మీ పరికరాన్ని, ఇంటర్నెట్ మోడెమ్‌ను మరియు/లేదా రూటర్‌ను పునఃప్రారంభిస్తే సమస్య పరిష్కారమవుతుంది.
 • ఇతర ఇంటర్నెట్ కార్యకలాపాన్ని తాత్కాలికంగా ఆపివేయండి - మీరు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కి చాలా ఎక్కువ పరికరాలు కనెక్ట్ అయ్యాయా? ఇతర పరికరాలతో కూడిన నెట్‌వర్క్ ను మీ పరికరం పంచుకుంటే, ఇది మీ కనెక్షన్ వేగం, స్ట్రీమింగ్ నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. సాధ్యమైతే, మీ నెట్‌వర్క్ కు కనెక్ట్ చేసిన ఇతర పరికరాల్లో ఫైల్ డౌన్‌లోడింగ్, ఆన్‌లైన్ గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ లాంటి కార్యకలాపాలను తాత్కాలికంగా విరమించేందుకు ప్రయత్నించండి.
 • మీ ఇంటర్నెట్ సేవా సంస్థ (ISP) కనెక్షన్‌ను పరిశీలించండి - మీ కనెక్షన్ వేగం సాధారణం కన్నా బాగా తక్కువగా ఉంటే (మరియు మీరు ఇప్పటికే మీ ఇంటర్నెట్ మోడమ్ లేదా రూటర్‌ను పునఃప్రారంభించి ఉంటే), అదనపు సహాయం కోసం మీ ISPని సంప్రదించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
 • VPN, ప్రాక్సీ లేదా “అన్‌బ్లాకర్” సేవను నిలిపివేయండి - మరింత సమాచారం కోసం, Prime Videoను యాక్సెస్ చేసుకోవడానికి VPN లేదా ప్రాక్సీని ఉపయోగించడంని చూడండి.
పిన్ ఎర్రర్‌లు

ఎర్రర్ కోడ్లు: 5014, 5016

మీ పిన్‌తో ఏదైనా సమస్య ఉంటే ఈ ఎర్రర్లు సంభవిస్తాయి.

 • తర్వాత మళ్లీ ప్రయత్నించండి - సాధారణంగా పిన్ సమస్యలు తాత్కాలికమైనవి. కొన్ని నిమిషాల పాటు వేచి ఉండి, తర్వాత మీ పిన్‌ను మళ్లీ ఎంటర్ చేయండి.
 • మీ పిన్ సెట్టింగ్‌లను మార్చండి - సమస్య కొనసాగుతుంటే, మీరు మీ పిన్‌ను రీసెట్ చేయవచ్చు లేదా ఖాతా & సెట్టింగ్‌లు నుండి పెద్దల నియంత్రణలను ఆఫ్ చేయవచ్చు.

మరింత సమాచారం కోసం, Prime Video పెద్దల నియంత్రణలను నిర్వహించండికు వెళ్ళండి.

సైన్ ఇన్ లేదా సైన్ అవుట్ ఎర్రర్‌లు

ఎర్రర్ కోడ్లు: 5005

సైన్ ఇన్ లేదా సైన్ అవుట్ ప్రక్రియతో ఏదైనా సమస్య ఉంటే ఈ ఎర్రర్‌లు సంభవిస్తాయి.

 • సైన్ ఇన్ సందర్భంగా సంభవించే సమస్యల కోసం

  మీ Prime Video లేదా Amazon Prime సభ్యత్వానికి సంబంధించిన ఖాతా సమాచారాన్ని నమోదు చేయాలని నిర్ధారించుకోండి. ఒక ఎర్రర్‌ అలాగే కనిపిస్తుంటే, దయచేసి, కాసేపు వేచిచూసి, తర్వాత మళ్లీ ప్రయత్నించండి. సైన్ ఇన్ ఎర్రర్‌లు తాత్కాలిక కనక్టివిటీ సమస్యల కారణంగా ప్రత్యేకంగా సంభవిస్తాయి.

 • సైన్ అవుట్ సందర్భంగా సంభవించే సమస్యల కోసం

  మీ పరికరంలో ఎర్రర్ కనిపిస్తుంటే, మీరు Prime Video వెబ్‌సైట్‌లో ఖాతా & సెట్టింగ్‌లు నుండి లేదా Android మరియు iOS కోసం Prime Video యాప్‌లోని సెట్టింగ్‌లు మెను నుండి సైన్ అవుట్ కూడా చేయవచ్చు. నమోదు చేసిన పరికరాలులో మీ పరికరాన్ని ఎంచుకుని, దాని పక్కన ఉన్న నమోదుని తీసివేయి ఎంపికను ఎంచుకోండి.

మరింత సమాచారం కోసం, మీ Prime Video పరికరాలను నిర్వహించండికు వెళ్ళండి.

ఇతర Prime Video సమస్యలు

ఈ చిట్కాలు మీ సమస్యలను పరిష్కరించకుంటే, మీ పరికరానికి నిర్దిష్టమైన సహాయం కోసం Prime Video సమస్యలుని చూడండి.

సంబంధిత సహాయ అంశాలు