సైన్ ఇన్

సహాయం

మీ మొబైల్ పరికరంలో సమస్యలు పరిష్కరించండి

మీ పరికరంలో Prime Video శీర్షికలను చూడటంలో సమస్య ఉన్నట్లయితే, కొన్ని సహాయపడగల పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి.

వీడియోని మరియు మీ పరికరాన్ని పునఃప్రారంభించండి

మీరు చూస్తున్న వీడియోలో ప్లేబ్యాక్ నుండి నిష్క్రమించండి. వీడియోని మళ్లీ ప్రారంభించడం కోసం వీడియో వివరాల నుండి పునఃప్రారంభించుని నొక్కండి.

ఇది పని చేయకపోతే, మీ పరికరాన్ని పునఃప్రారంభించి ప్రయత్నించండి.

Tip: చాలా పరికరాలలో పవర్ బటన్‌ని కొన్ని సెకన్ల పాటు నొక్కి, పట్టుకుంటే సరిపోతుంది. తదుపరి స్క్రీన్‌లో "ఆఫ్ చేయండి" లేదా "పవర్ ఆఫ్ చేయండి" ఎంపికను ఎంచుకోండి. మీ పరికరాన్ని ఆపివేసిన తర్వాత, దాన్ని తిరిగి ఆన్ చేయడానికి మళ్లీ పవర్ బటన్‌ను నొక్కి, పట్టుకోండి.
మీ పరికరం పునఃప్రారంబించబడిన తర్వాత, Prime Video యాప్‌కు తిరిగి వెళ్లి మీ వీడియోను చూడటానికి మళ్లీ ప్రయత్నించండి.

మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను తనిఖీ చేయండి

పాజింగ్ లేదా బఫరింగ్, సుదీర్ఘ లోడింగ్ సమయాలు మరియు తక్కువ వీడియో నాణ్యతతో పాటు చాలా వరకు ప్రసార సమస్యలు మీ ఇంటర్నెట్ కనెక్షన్ వల్లే ఏర్పడుతాయి. సాధారణ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి:

 • ఇతర ఇంటర్నెట్ కార్యకలాపాన్ని తాత్కాలికంగా పాజ్ చేయండి - మీ పరికరం ఒక నెట్‌వర్క్‌ని ఇతర కంప్యూటర్‌లతో లేదా పరికరాలతో పంచుకున్నప్పుడు, మీ కనెక్షన్ వేగం మరియు వీడియో నాణ్యతపై ప్రభావం పడుతుంది.. సాధారణంగా, మీ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిన ఇతర పరికరాలలో ఫైల్ డౌన్‌లోడింగ్, ఆన్‌లైన్ గేమింగ్ మరియు వీడియో ప్రసారం వంటి కార్యకలాపాల కారణంగా ఇలా జరుగుతుంది. సాధ్యమైతే మీ Prime Video ప్రసార బ్యాండ్‌విడ్త్‌ని గరిష్ట స్థాయిలోకి పెంచడం కోసం మీ ఇతర కనెక్ట్ అయిన పరికరాలలో ఇంటర్నెట్ కార్యకలాపాన్ని పాజ్ చేయండి.
 • మీ ఇంటర్నెట్ సేవా సంస్థ (ISP) కనెక్షన్‌ను పరిశీలించండి - మీ కనెక్షన్ వేగం సాధారణం కన్నా బాగా తక్కువగా ఉంటే, అదనపు సహాయం కోసం మీ ISPని సంప్రదించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

యాప్ డేటాను క్లియర్ చేయండి (Android పరికరాల కోసం)

మీరు ఒక iOS పరికరాన్ని ఉపయోగిస్తుంటే, మీరు ఈ దశలను దాటవేయవచ్చు. ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల కోసం iOS పరికరాలు "క్లియర్ డేటా" ఎంపికను కలిగి ఉండవు.

మీరు ఒక Android పరికరాన్ని ఉపయోగిస్తుంటే, Prime Video యాప్ యొక్క డేటాను క్లియర్ చేయడానికి ప్రయత్నించండి:

Important: యాప్ డేటాని క్లియర్ చేసినట్లయితే, డౌన్‌లోడ్ చేయబడిన Prime Video శీర్షికలు తొలగించబడతాయి.

 1. మీ పరికరంలో సెట్టింగ్‌లు మెను తెరవండి.
 2. యాప్‌లు లేదా అప్లికేషన్ మేనేజర్ నొక్కండి.
 3. జాబితా నుండి Prime Video యాప్‌ను ఎంచుకోండి.
 4. ఆపై డేటాని క్లియర్ చేయిని నొక్కిన తర్వాత, సరేని నొక్కండి.
 5. Prime Videoని తిరిగి తెరిచి, మీ వీడియోని ప్లే చేయడానికి మళ్లీ ప్రయత్నించండి.

మీరు యాప్(ల) డేటాను క్లియర్ చేసిన తర్వాత, మీరు Prime Videoను మళ్లీ తెరచినప్పుడు మళ్లీ సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు.

యాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి

పైన పేర్కొన్న దశల్లో ఏదీ ఈ సమస్యను పరిష్కరించకపోతే, Prime Video యాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.

Android పరికరాలు

Prime Video యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడానికి:

 1. మీ పరికరంలో సెట్టింగ్‌లు మెను తెరవండి.
 2. యాప్‌లు లేదా అప్లికేషన్ మేనేజర్ నొక్కండి.
 3. జాబితా నుండి Prime Video యాప్‌ను ఎంచుకోండి.
 4. అన్ఇన్‌స్టాల్ చేయండిని నొక్కి, సరేని ఎంచుకోండి.

మళ్లీ ఇన్‌స్టాల్ చేయడానికి:

 1. మీ పరికరంలో Amazon Appstore, Amazon Underground యాప్, Samsung Galaxy Appstore లేదా Google Play Storeని తెరవండి.
 2. "Prime Video" కోసం వెతకండి.
 3. యాప్ వివరాలు పేజీని తెరిచి, "డౌన్‌లోడ్ చేయి" ఎంపికను ఎంచుకోండి.
 4. మీ ఖాతాను యాప్‌కు రీకనెక్ట్ చేయడానికి సైన్ ఇన్ చేయండి. మీ Prime Video లేదా Amazon Prime సభ్యత్వానికి సంబంధించిన ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.

iOS పరికరాలు

Prime Video యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడానికి:

 1. మీ స్క్రీన్‌పై ఉన్న అన్ని చిహ్నాలు కదలడం ప్రారంభించే వరకు "Prime Video" యాప్ చిహ్నాన్ని నొక్కి, పట్టుకోండి.
 2. Prime Video యాప్ ఎగువ ఎడమ మూలలో కనిపించే చిన్న "x" చిహ్నాన్ని నొక్కండి.
 3. తొలగించు బటన్‌ని నొక్కండి.

మళ్లీ ఇన్‌స్టాల్ చేయడానికి:

 1. మీ పరికరంలో యాప్ స్టోర్ యాప్‌ను తెరవండి.
 2. “Prime Video” కోసం వెతకండి.
 3. యాప్ వివరాలు పేజీని తెరిచి, "క్లౌడ్ నుంచి డౌన్‌లోడ్‌ చేయండి" ఎంపికను ("క్లౌడ్" చిహ్నం) ఎంచుకోండి.
 4. మీ ఖాతాను యాప్‌కు రీకనెక్ట్ చేయడానికి సైన్ ఇన్ చేయండి. మీ Prime Video లేదా Amazon Prime సభ్యత్వానికి సంబంధించిన ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.

సంబంధిత సహాయ అంశాలు