సైన్ ఇన్

సహాయం

సమస్య పరిష్కార ప్రక్రియ

Prime Video సబ్‌స్క్రిప్షన్‌ల కోసం స్థానిక కరెన్సీలలో చెల్లించడం

Prime Video సభ్యత్వ ఎంపికలలో మార్పుల గురించి తెలుసుకోండి.

ఏమి మారుతోంది?

ఎంపిక చేసిన దేశాలలో నివసిస్తున్న కస్టమర్లు ఇప్పుడు Prime Video సబ్‌స్క్రిప్షన్‌ కోసం US డాలర్లు లేదా యూరోలలో కాకుండా స్థానిక కరెన్సీలో చెల్లింపును ఎంచుకోవచ్చు. అయినప్పటికీ వాళ్లు అదే కంటెంట్‌ను అవే డివైజ్‌లలో ఎప్పటిలాగే యాక్సెస్‌ చేయగలుగుతారు.

కరెన్సీతో సంబంధం లేకుండా మేము మాస్టర్‌కార్డ్‌, వీసా డెబిట్‌ మరియు క్రెడిట్‌ కార్డులను ప్రపంచంలో ఎక్కడైనా అంగీకరిస్తాము. మేము స్థానిక కరెన్సీలలో చెల్లింపు కోసం కింద పేర్కొన్న కార్డ్‌లను కూడా అంగీకరిస్తాము:

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (క్రెడిట్): అర్జెంటీనా, చిలీ, కొలంబియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్‌, హంగరీ, నార్వే, పరాగ్వే, పెరూ, పోలాండ్, రొమేనియా, స్వీడన్, స్విట్జర్లాండ్.

డైనర్స్ క్లబ్ (క్రెడిట్): అర్జెంటీనా, కొలంబియా, పరాగ్వే, పెరూ.

మెక్సికోలో, వినియోగదారులు ఇప్పుడు Amazon గిఫ్ట్ కార్డ్‌లను ఉపయోగించి వారి Amazon Prime సభ్యత్వం కోసం చెల్లించవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ చెల్లింపును అప్‌డేట్ చేయడం ఎలా

మీరు ఖాతా & సెట్టింగ్‌లు పేజీ నుండి మీ సబ్‌స్క్రిప్షన్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

గమనిక: ప్రస్తుతం, మీరు యాక్టివ్ Prime Video సబ్‌స్క్రిప్షన్‌ కలిగి ఉండి కింద పేర్కొన్న దేశాలలో నివసిస్తున్నట్లయితే, మీరు కేవలం మీ స్థానిక కరెన్సీలో చెల్లించగలరు: అర్జెంటీనా, చిలీ, కొలంబియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్‌, హంగరీ, న్యూజిలాండ్, నార్వే, పరాగ్వే, పెరూ, పోలాండ్, రొమేనియా, స్వీడన్ లేదా స్విట్జర్లాండ్; అలాగే అదే దేశానికి సంబంధించిన బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థ నుండి చెల్లింపు కార్డ్‌ను కలిగి ఉండాలి. కొత్త సబ్‌స్క్రైబర్‌లు, Prime Video లేదా Amazon Primeకు సైన్‌-అప్‌ చేసినప్పుడు వారి స్థానిక కరెన్సీలో సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాము.