సైన్ ఇన్

సహాయం

Prime Videoను యాక్సెస్ చేసుకోవడానికి VPN లేదా ప్రాక్సీని ఉపయోగించడం

VPN, ప్రాక్సీ లేదా “అన్‌బ్లాకర్” సేవ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు Prime Videoని ప్రసారం చేయడం సాధ్యం కాదు.

VPN, ప్రాక్సీ లేదా “అన్‌బ్లాకర్” ఎర్రర్‌లను ఎలా సరి చేయాలి

మీకు కింది ఎర్రర్‌లు కనిపిస్తున్నట్లయితే, మీరు మద్దతు లేని కనెక్షన్ రకాన్ని ఉపయోగించి Prime Videoని ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మేము గుర్తించాము అని అర్థం:

  • “చూడటం కోసం, VPN లేదా ప్రాక్సీ సేవలను ఆఫ్ చేయండి.”
  • “HTTP ప్రాక్సీ లేదా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) కనెక్షన్‌ని ఉపయోగించి మీ డివైజ్‌ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసారు. ప్రాక్సీ ప్రోగ్రామ్‌లు లేదా VPN కనెక్షన్‌లను మూసివేసి లేదా నిలిపివేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి.”
  • “మీ డివైజ్‌లోని ఇంటర్నెట్ కనెక్షన్ కోసం HTTP ప్రాక్సీ ఉపయోగించబడుతోంది, దీని కారణంగా మీరు వీడియోని ప్లే చేయలేకపోతున్నారు. ప్రాక్సీ ప్రోగ్రామ్‌లను మూసివేసిన లేదా నిలిపివేసిన తర్వాత మళ్లీ ప్రయత్నించండి.”

Prime Video ప్రసారాన్ని కొనసాగించడం కోసం:

  • VPNలు, ప్రాక్సీలు లేదా “అన్‌బ్లాకర్” సేవలను నిలిపివేయండి.
  • మీ డివైజ్ యొక్క నెట్‌వర్క్ సెట్టింగ్‌లు ఆటోమేటిక్కు సెట్ చేసారో లేదో చూడండి.

మీరు ఈ దశలను పూర్తి చేసిన తర్వాత కూడా ఎర్రర్ కనిపిస్తూనే ఉంటే, దయచేసి సహాయం కోసం మీ ఇంటర్నెట్ సేవా ప్రదాతను సంప్రదించండి.

మరింత సమాచారం కోసం, Prime Video నిబంధనలు మరియు షరతులును చూడండి.

  • ఇంటర్నెట్ సేవా ప్రదాతలు - తప్పుగా నమోదు చేసిన IP చిరునామాలను అన్‌బ్లాక్ చేయడంలో సహాయం కావాలంటే, IP పరిధులు మరియు మీ సంస్థలో సంప్రదించాల్సిన వ్యక్తి వివరాలతో D2C2-ISP-Support@amazon.comని సంప్రదించండి.