సైన్ ఇన్

సహాయం

మొబైల్ పరికరాలలో Prime Video వీక్షించండి

మొబైల్ పరికరాలలో Prime video యాప్‌ ద్వారా Prime Videoను ఎలా వీక్షించాలో తెలుసుకోండి.

Android పరికరాలు

పరికర హార్డ్‌వేర్ & ఆపరేటింగ్ సిస్టమ్ అవసరాలు

 • ప్రాసెసర్ రకం: ARM, డ్యుయల్-కోర్ ప్రాసెసర్ లేదా అంతకన్నా మెరుగైనవి; Intel ప్రాసెసర్‌లకు ప్రస్తుతం మద్దతు లేదు
 • ప్రాసెసర్ వేగం: 1.2GHzకన్నా ఎక్కువ
 • పరికరం మెమొరీ: కనీసం 1GB
 • కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ OS 4.0 (ఐస్ క్రీమ్ శాండ్‌విచ్) లేదా ఎక్కువ

  Note: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని సవరించిన వెర్షన్స్‌ను, ఆండ్రాయిడ్ యాప్‌లను నడిపే బ్లాక్‌బెరీ పరికరాలకు మద్దతు లేదు.

అండ్రాయిడ్‌ కోసం Prime video యాప్‌ను అందుకోండి

Amazon అండర్‌గ్రౌండ్ యాప్, Amazon యాప్, Samsung గెలాక్సీ Appstore, Google యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉన్న Prime Video యాప్‌ ద్వారా మీ ఆండ్రాయిడ్ పరికరంలో Prime Video ను మీరు వీక్షించవచ్చు. కేవలం "Prime Video" కోసం వెతకండి.

మరింత సమాచారం కోసం ఎక్కడైనా వీక్షించండి పేజీలోకి వెళ్లండి.

Prime Video యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తెరచిన తర్వాత:
 1. యాప్‌కు మీ ఖాతాను కనెక్ట్ చేసేందుకు సైన్ ఇన్ చేయండి. మీ Prime Video లేదా Amazon Prime సభ్యత్వానికి సంబంధించిన ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.

  Note: మీకు ఖాతా లేదా? ఒక Prime Video సభ్యత్వం లేదా ఉచిత ట్రయల్‌ని ఎలా ప్రారంభించాలి గురించి మరింత తెలుసుకోండి.

 2. వీడియో వివరాలను తెరిచేందుకు ఒక చలన చిత్రం లేదా టీవీ కార్యక్రమాన్ని ఎంచుకోండి.
 3. వీడియో ప్లేబ్యాక్‌ను ప్రారంభించేందుకు ఇప్పుడు వీక్షించండిని లేదా పునఃప్రారంభించండిని నొక్కండి.

iOS పరికరాలు

మద్దతు కలిగిన పరికరాలు & ఆపరేటింగ్ సిస్టంలు

iOS 8.0 లేదా ఆ తర్వాతి వెర్షన్‌ల iPhone, iPad, మరియు iPod టచ్ పరికరాలు.

Note:

 • iOS ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సవరించిన వెర్షన్‌లకు మద్దతు లేదు.
 • Prime video యాప్‌ iPhone 4లో అందుబాటులో లేదు.

iOS Prime video యాప్‌ను అందుకోండి

Apple యాప్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉన్న Prime Video యాప్‌ ద్వారా మీ iOS పరికరంలో Prime Videoను మీరు వీక్షించవచ్చు. కేవలం "Prime Video" కోసం వెతకండి.

మరింత సమాచారం కోసంఎక్కడైనా వీక్షించండి పేజీకి వెళ్లండి.

Prime Video యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తెరచిన తర్వాత:

 1. యాప్‌కు మీ ఖాతాను కనెక్ట్ చేసేందుకు సైన్ ఇన్ చేయండి. మీ Prime Video లేదా Amazon Prime సభ్యత్వానికి సంబంధించిన ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.
 2. వీడియో వివరాలను తెరిచేందుకు ఒక చలన చిత్రం లేదా టీవీ కార్యక్రమాన్ని ఎంచుకోండి.
 3. వీడియో ప్లేబ్యాక్‌ను ప్రారంభించేందుకు ఇప్పుడు వీక్షించండిని లేదా పునఃప్రారంభించండిని నొక్కండి.

సంబంధిత సహాయ అంశాలు