సైన్ ఇన్

సహాయం

కంప్యూటర్‌ల కోసం సిస్టమ్ అవసరాలు

మీ కంప్యూటర్‌లోని వెబ్ బ్రౌజర్ నుండి Prime Videoని చూడటం కోసం సిస్టమ్ అవసరాల గురించి తెలుసుకోండి.

కంప్యూటర్ హార్డ్‌వేర్

Intel కోర్ 2 డ్యుయో ప్రాసెసర్ (లేదా దానికి సమానమైనది)

కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్

 • Windows 7 లేదా అంతకంటే కొత్తది
 • Mac OS 10.7 లేదా అంతకంటే కొత్తది
 • మీరు Linux/UNIX ఆపరేటింగ్ సిస్టమ్‌లలో (Chrome OSలో కూడా)) Chromeని ఉపయోగించి Prime Videoని చూడవచ్చు; అయితే, స్టాండర్డ్ డెఫినిషన్ (SD)లో మాత్రమే ప్లేబ్యాక్ చేయగలరు.

ఇంటర్నెట్ కనెక్షన్

 • స్టాండర్డ్ డెఫినిషన్ (SD) వీడియోలు: 900 Kbits/sec
 • హై డెఫినిషన్ (HD) వీడియోలు: 3.5 Mbits/sec

Note: వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) లేదా ప్రాక్సీ కనెక్షన్‌ల ద్వారా Prime Videoని ప్రసారం చేయడానికి మద్దతు లేదు. Prime Videoని చూడాలనుకుంటే, మీరు మీ పరికరంలో ఈ సేవలను నిలిపివేయాలి లేదా అందుబాటులో ఉన్న మరో కనెక్షన్‌కి మారాలి.

వెబ్ బ్రౌజర్‌లు

 • Chrome (వెర్షన్ 62 లేదా కొత్తది)
 • Firefox (వెర్షన్ 53 లేదా కొత్తది)
 • Internet Explorer (వెర్షన్ 11 లేదా కొత్తది)
 • Windows 10లో Microsoft Edge
 • Safari (Mac OS 10.12.1 లో వెర్షన్ 10 లేదా సరికొత్తది)
 • Opera (వెర్షన్ 37 లేదా కొత్తది)

Note: ప్రస్తుతానికి Firefox ESRకి మద్దతు లేదు. సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత Firefox ESR (వెర్షన్ 60)కి మద్దతు ఉంటుంది, అంటే దాదాపుగా 1 మే 2018.

Tip: మీ కంప్యూటర్‌లో Prime Videoని చూడాలనుకుంటే, మా HTML5 వీడియో ప్లేయర్‌కి మద్దతు ఉన్న బ్రౌజర్‌ని ఉపయోగించాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. Prime Video సేవతో పని చేసే విధంగా HTML5 ఆప్టిమైజ్ చేయబడింది మరియు వీడియో కంటెంట్‌ని ప్లే చేయడం కోసం వేరే బ్రౌజర్ ప్లగిన్‌లను ఉపయోగించవద్దు. ఆటో ప్లే మరియు పూర్తి 1080p హై డెఫినిషన్‌లో ప్లే చేయడం వంటి వీడియో ఫీచర్‌లకు కూడా ఇది మద్దతిస్తుంది.

బ్రౌజర్ ప్లగిన్‌లు

మా HTML5 ప్లేయర్‌కి మద్దతు లేని బ్రౌజర్ లేదా బ్రౌజర్ వెర్షన్‌ని మీరు ఉపయోగించినట్లయితే, మీరు Microsoft Silverlightతో Prime Videoని యాక్సెస్ చేయవచ్చు.

Silverlight అన్నది Safariలో మరియు Internet Explorer యొక్క కొన్ని వెర్షన్‌లలో Prime Videoని ప్లే చేయడానికి ఉపయోగపడే బ్రౌజర్ ప్లగిన్. సాధారణంగా అయితే, మీ బ్రౌజర్ కోసం Silverlightని ఇన్‌స్టాల్ చేయాలని లేదా యాక్టివేట్ చేయాలని స్క్రీన్‌లో సందేశం కనిపిస్తుంది.

Silverlight 5.1 అన్నది కనీస మద్దతు ఉన్న వెర్షన్. తాజా వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేయడం కోసం, Microsoft Silverlightని పొందండిలోకి వెళ్లండి.

Tip: Silverlightని యాక్టివేట్ చేయడంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే, మీ బ్రౌజర్ యాడ్-ఆన్‌లు లేదా ప్లగిన్ ప్రాధాన్యతలను Silverlightని "ఎప్పటికీ యాక్టివేట్ చేయవద్దు"ని సెట్ చేయలేదని నిర్ధారించుకోండి. మీ బ్రౌజర్ నుండి Silverlightని యాక్సెస్ చేయాలనుకుంటే, మీరు ఈ సెట్టింగ్‌లను "యాక్టివేట్ చేయడానికి అడగాలి" లేదా "ఎల్లప్పుడూ యాక్టివేట్ చేయి" అని మార్చండి.

సంబంధిత సహాయ అంశాలు