సైన్ ఇన్

సహాయం

మీ ఆడియో భాష & ఉపశీర్షికల ప్రాధాన్యతలను నిర్వహించండి

Prime Videoకు భాష మరియు ఉపశీర్షికల ప్రాధాన్యతలను నిర్వహించడం ఎలాగో తెలుసుకోండి.

ఈ సమయంలో, Prime Video వెబ్‌సైట్ మరియు Prime Video యాప్ ఇంటర్ఫేస్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, పోర్చుగీస్‌ భాషల్లో లభిస్తున్నాయి.

అనేక Prime Video శీర్షికలలో, మీరు ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, జర్మన్, పోర్చుగీస్‌, ఇంగ్లీష్ సహా వీడియో ప్లేబ్యాక్ కోసం అనేక భాషలను ఉపశీర్షికలు మరియు డబ్బింగ్ కోసం ఎంచుకోవచ్చు.

వీడియో ప్లేబ్యాక్ కోసం మీ భాష ప్రాధాన్యతలను మార్చండి

వీడియో ప్లేయర్ నుంచి ఉపశీర్షికలు, డబ్బింగ్ కోసం మీరు ఒక డిఫాల్ట్ భాషను అమర్చవచ్చు:

  1. ప్లేబ్యాక్ నియంత్రణల్లో ఉపశీర్షికలు మరియు ఆడియో ("ప్రసంగం బబుల్" చిహ్నం)ని ఎంచుకోవచ్చు.
  2. డ్రాప్ డౌన్ మెను నుంచి మీ ప్రాధాన్య ఉపశీర్షిక భాష మరియు ఆడియో భాషను ఎంచుకోండి.

టీవీలలో మీ భాష ప్రాధాన్యతలను మార్చండి:

  1. ప్లేబ్యాక్‌కు ముందు, ఎంచుకున్న చలన చిత్రం లేదా టీవీ షోతో, ఎగువ మెను నుంచి ఉపశీర్షికలు లేదా ఆడియో భాషలు ఎంచుకోండి.
  2. అందుబాటులో ఉన్న ఎంపికల నుండి మీకు కావలసిన భాషని ఎంచుకోండి.

ఎంచుకున్న భాష అందుబాటులో ఉంటే ఈ పరికరంలో ఒక వీడియోను మీరు ప్లే చేసినప్పుడల్లా మీ భాష ఎంపిక తనంతతానుగా ఉపయోగించబడుతుంది.

Note: మీరు వీక్షిస్తున్న చలన చిత్రం లేదా టీవి షోకు మీ ప్రాధాన్య భాష అందుబాటులో ఉంటే సబ్‌టైటిల్స్‌ మరియు ఆడియో ఆ భాషలో మాత్రమే ప్లే చేయబడుతాయి. మరింత తెలుసుకోవాలనుకుంటే, ఉపశీర్షికలు & బహుళ భాషలలో ఆడియోని ఆన్ చేయండిలోకి వెళ్లండి.

అనుకూలీకరించిన ఉపశీర్షికల ప్రదర్శన

Prime Video వెబ్‌సైట్‌లో ఉపశీర్షికల కోసం ఉపయోగించే టెక్స్ట్ డిస్‌ప్లేను కూడా మీరు అనుకూలంగా చేసుకోవచ్చు:

  1. ఖాతా & సెట్టింగ్‌లుకు వెళ్ళండి.
  2. పైభాగంలోని మెను నుంచి ఉపశీర్షికలు తెరవండి.
  3. మీ ప్రీసెట్‌లను కాన్ఫిగర్ చేసుకునేందుకు సవరించు బటన్‌ను ఉపయోగించండి. మీరు టెక్స్ట్ రంగు, స్టైల్, పరిమాణం తదితరాలను మార్చవచ్చు.

Tip: Prime Video వెబ్‌సైట్‌లో ఒక చలనచిత్రం లేదా టీవి షోను మీరు వీక్షించే సమయంలో కూడా దీనిని చేయవచ్చు. మీ ప్లేబ్యాక్ నియంత్రణలలో ఉపశీర్షికలు మరియు ఆడియో ("ప్రసంగం బబుల్" చిహ్నం) ఎంచుకుని, ప్రీసెట్ ఎంపికల నుండి మీ ప్రాధాన్య వచన ప్రదర్శనను ఎంచుకోండి.

సంబంధిత సహాయ అంశాలు