సైన్ ఇన్

సహాయం

ఇమెయిల్ Amazon Prime Video నుండి వచ్చిందేనా అని గుర్తించడం గురించి

మీరు ఒక అనుమానాస్పద ఇమెయిల్ (ఇవి ఫిషింగ్ అని కూడా పిలువబడుతాయి) అందుకుంటే, అది Amazon Prime Video నుండి ఇమెయిల్ అవునో, కాదో నిర్ధారించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

ఎప్పటికప్పుడు మీరు Amazon Prime Video నుండి వచ్చినట్లు అనిపించే తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ఇ-మెయిల్స్ అందుకోవచ్చు, ఇవి అసలు Amazon Prime Video ఖాతాల నుండి రావు; బదులుగా, అవి తప్పుదారి పట్టించడానికి మరియు సున్నితమైన ఖాతా సమాచారాన్ని బహిర్గతం చేయడానికి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాయి. "స్పూఫ్ ఇమెయిల్‌లు" లేదా "ఫిషింగ్ ఇమెయిల్‌లు" అని పిలిచే ఈ అబద్ధపు ఇమెయిల్‌లు నిజమైన ఇమెయిల్‌ల లాగానే ఉంటాయి. ఈ ఇమెయిల్‌లు తరచూ మిమ్మల్ని నేరుగా Amazon Prime Video వెబ్‌సైట్‌ను పోలినట్టుండే ఒక తప్పుడు వెబ్‌సైట్‌కు తీసుకువెళతాయి అక్కడ మీ ఖాతా సమాచారాన్ని, పాస్‌వర్డ్‌ను ఇవ్వాలని మిమ్మల్ని కోరవచ్చు.

దురదృష్టవశాత్తు, ఈ తప్పుడు వెబ్‌సైట్‌లు మీ సున్నితమైన సమాచారాన్ని దొంగిలించవచ్చు. తర్వాత మోసానికి పాల్పడడం కోసం ఈ సున్నితమైన సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

ఈ ఇమెయిల్‌లుకు స్పందించడం నుంచి, సున్నితమైన లేదా రహస్యమైన సమాచారాన్ని బయటపెట్టడం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం మీరు కొన్ని సాధారణ నిబంధనలను అనుసరించవచ్చు:

Amazon Prime Video కోరనిది ఏమిటో తెలుసుకోండి

ఒక ఇమెయిల్ కమ్యూనికేషన్‌లో కింది సమాచారాన్ని Amazon Prime Video ఎన్నడూ మిమ్మల్ని కోరదు:

 • మీ జాతీయ ID, బీమా, లేదా ఇతర వ్యక్తిగత గుర్తింపు సంఖ్య
 • మీ బ్యాంకు ఖాతా సమాచారం, క్రెడిట్ కార్డు సంఖ్య, పిన్ సంఖ్య లేదా క్రెడిట్ కార్డు భద్రత కోడ్ (పైవాటిలో దేనికైనా "అప్‌డేట్‌ల"తో సహా)
 • మీ అమ్మ మొదటి పేరు లేదా మిమ్మల్ని గుర్తించగలిగే ఇతర వ్యక్తిగత సమాచారం (మీ పుట్టిన ప్రదేశం లేదా మీకు నచ్చిన పెంపుడు జంతువు పేరు లాంటివి)
 • మీ Amazon Prime Video పాస్‌వర్డ్

వ్యాకరణ లేదా అక్షరక్రమ దోషాలను సమీక్షించండి

అద్వాన్నమైన వ్యాకరణ లేదా అక్షరక్రమ దోషాల కోసం సరిచూడండి. అనేక ఫిషింగ్ ఇమెయిల్‌లు ఇతర భాషల్లోకి అనువదించబడి ఉంటాయి లేదా ప్రూఫ్ రీడింగ్ చేయకనే పంపించబడుతాయి. దీని ఫలితంగా, ఈ సందేశాలు అధ్వాన్నమైన వ్యాకరణ లేదా అక్షరక్రమ దోషాలను కలిగి ఉంటాయి.

ప్రత్యుత్తర చిరునామాను సరిచూసుకోండి

ఆ ఇమెయిల్ అంగీకరించబడిన Amazon ఇమెయిల్ నుండి వచ్చిందా లేదా ఒక “ఫిషర్” నుండి వచ్చిందా? అచ్ఛమైన ఇమెయిల్‌లు దీంతో ముగిసే ఒక ఇమెయిల్ చిరునామా నుండి వస్తాయి:

 • @primevideo.com
 • @amazon.com
 • @amazon.lu
 • @amazon.co.uk
 • @amazon.ca
 • @amazon.com.mx
 • @amazon.com.br
 • @amazon.de
 • @amazon.fr
 • @amazon.it
 • @amazon.es
 • @amazon.in
 • @amazon.cn
 • @amazon.co.jp
 • @amazon.com.au
 • @amazon.ae
 • @amazon.nl

ఫిషర్లు తరచూ బూటకపు ఇ-మెయిల్‌ను Amazon నుంచి వచ్చినట్టు కనిపించేలాగే పంపుతారు కాబట్టి మీరు తరచూ ప్రత్యుత్తర చిరునామాను పరిశీలించుకోవడం ద్వారా వాటి విశ్వసనీయతను నిర్ధారించుకోవచ్చు. "amazon-security@hotmail.com" లేదా "amazon-payments@msn.com,"లాంటివిగా కనిపించే ఇమెయిళ్ల "from" లైన్ నుంచి లేదా పైన పేర్కొనని మరేదైనా ఇంటర్నెట్ సేవా ప్రదాత (ISP) పేరును కలిగి ఉంటే, అది ఒక మోసపూరితమైన ఇమెయిల్ అని మీరు ఖచ్చితంగా భావించవచ్చు.

చాలావరకు ఇమెయిల్ క్లయింట్‌లు ఇమెయిల్‌లు మూలాన్ని పరీక్షించేందుకు మిమ్మల్ని అనుమతిస్తారు. పైన పేర్కొన్న మెయిల్ చిరునామాలలో ఒకదాని నుంచి వచ్చే ఇమెయిల్ కోసం "received from," "reply to" మరియు "return path" అనే ఇమెయిల్ హెడర్ సమాచారం ఉందా అని పరిశీలించండి. హెడర్ సమాచారాన్ని పరిశీలించేందుకు మీరు ఉపయోగించే పద్ధతి మీరు ఉపయోగించే ఇమెయిల్ క్లయింట్ పైన ఆధారపడి ఉంటుంది.

వెబ్‌సైట్ చిరునామాను పరిశీలించండి

URLలో ఎక్కడైనా "amazon" పదం కలిగిన నకిలీ వెబ్‌సైట్‌లను ఫిషర్‌లు రూపొందిస్తారు. అచ్చమైన Prime Video వెబ్‌సైట్ ఎప్పుడూ “.primevideo.com” తో ముగుస్తుంది మరియు Amazon వెబ్‌సైట్‌లు ఎప్పుడూ కింది డొమెయిన్‌లలో ఒకదానితోనే ముగుస్తాయి:

 • .primevideo.com
 • .amazon.com
 • .amazon.lu
 • .amazon.co.uk
 • .amazon.ca
 • .amazon.com.mx
 • .amazon.com.br
 • .amazon.de
 • .amazon.at
 • .amazon.fr
 • .amazon.it
 • .amazon.es
 • .amazon.in
 • .amazon.cn
 • .amazon.co.jp
 • .amazon.com.au
 • .amazon.ae
 • .amazon.nl

మేము ఎన్నడూ "security-primevideo.com" లేదా "primevideo.com.biz" లాంటివి ఉపయోగించము.

కొన్ని ఫిషింగ్ ఇమెయిల్‌లు మీ ఖాతాకు మిమ్మల్ని తీసుకువెళుతున్నట్టు అనిపించే ఒక లింక్‌ను కలిగి ఉంటాయి, కానీ అది పూర్తిగా భిన్నమైన మరో వెబ్‌సైట్‌కు ఒక సంక్షిప్త లింక్ మాత్రమే. మీ ఇమెయిల్ క్లయింట్‌లోని లింక్‌ను మీరు పైపైన చూస్తే, కొన్నిసార్లు మీకు పాపప్‌గా లేదా బ్రౌజర్ స్టేటస్ బార్‌లోని సమాచారంగా దాని మూలమైన తప్పుడు చిరునామా మీకు కనిపించవచ్చు.

సందేహం వచ్చినప్పుడు, మా సహాయం పేజీలలోని మమ్మల్ని సంప్రదించండి ద్వారా కస్టమర్ సర్వీస్‌తో మాట్లాడండి..