సైన్ ఇన్

సహాయం

Samsung టీవీలలో Prime Video వీక్షించండి

మీ Samsung స్మార్ట్‌ టీవీలో Prime Videoను ఎలా వీక్షించాలో తెలుసుకోండి.

Prime Video యాప్‌ ద్వారా మీ Samsung స్మార్ట్‌ టీవీలో Prime Videoని వీక్షించవచ్చు.

మద్దతు కలిగిన మోడల్‌లు

  • HD ప్లేబ్యాక్: 2012లో లేదా ఆ తర్వాత విడుదల చేసిన Samsung స్మార్ట్‌ టీవీలలో అందుబాటులో ఉంది.
  • 4K Ultra HD ప్లేబ్యాక్: 2014 లో లేదా ఆ తర్వాత విడుదల చేసిన Samsung అల్‌ట్రా HD టీవీలలో అందుబాటులో ఉంది.
  • HDR ప్లేబ్యాక్: ఎంపిక చేసిన Samsung SUHD టీవీలలో అందుబాటులో ఉంది.

Prime Video యాప్‌ను అందుకోండి

Samsung స్మార్ట్ హబ్ నుంచి మీరు Prime video యాప్‌ను అందుకోవచ్చు:

  1. మీ టీవీ రిమోట్‌లోని Smart Hub బటన్‌ను నొక్కండి.
  2. మెను నుంచి Samsung యాప్‌లు ఎంచుకోండి.
  3. Prime Videoని ఎంచుకోండి.

Prime Video యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తెరచిన తర్వాత:

  1. యాప్‌కు మీ ఖాతాను కనెక్ట్ చేసేందుకు సైన్ ఇన్ చేయండి. మీ Prime Video లేదా Amazon Prime సభ్యత్వానికి సంబంధించిన ఖాతా సమాచారాన్ని నమోదు చేయండి.
  2. వీడియో వివరాలను తెరిచేందుకు ఒక చలన చిత్రం లేదా టీవీ కార్యక్రమాన్ని ఎంచుకోండి. తర్వాత ప్లేబ్యాక్‌ను ప్రారంభించేందుకు ఇప్పుడు వీక్షించండి లేదా కొనసాగించండి ని ఎంచుకోండి.

సంబంధిత సహాయ అంశాలు