సైన్ ఇన్

సహాయం

Watch Parties కమ్యూనిటీ మార్గదర్శకాలు

Watch Partiesలో పాల్గొన్నవారందరూ ఒకరినొకరు సురక్షితంగా మాట్లాడుకోగలిగిన చోట గొప్పగా పంచుకోగలిగిన సామాజిక వీడియో అనుభవాన్ని అందించడానికి Prime Video కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, యూజర్‌లు అందరూ మన Watch Parties కోసం స్నేహపూర్వక, సానుకూల అనుభవాన్ని అందించే విధంగా పాల్గొనాల్సిందిగా మేం కోరుతున్నాం.

మన Prime Video వాడకం నిబంధనలకు అదనంగా, Watch Parties కు ఈ క్రింది కమ్యూనిటీ మార్గదర్శకాలు ( "మార్గదర్శకాలు" ) వర్తిస్తాయి. మేం కాలానుగతంగా ఈ మార్గదర్శకాలను అప్‌డేట్ చేయవచ్చు, మేం కొన్నిరకాలైన కంటెంట్ కొరకు అదనపు మార్గదర్శకాలు లేదా నిర్ధిష్ట మినహాయింపులను అవలంబించవచ్చు.

మేం మా సంపూర్ణ విచక్షణకు అనుగుణంగా ఏ సమయములోనైనా, Watch Parties ఫీచర్లను నిలిపివేయవచ్చు లేదా మార్చవచ్చు. మన కమ్యూనిటీ యొక్క సమగ్రతను కాపాడటానికి, ఒక Watch Party హోస్ట్ లేదా హోస్ట్‌చే నియమించబడిన మోడరేటర్లకు వారి Watch Party లో పాల్గొనడానికి ఎవరికి అనుమతి ఉందో నిర్ణయించడానికి పూర్తి విచక్షణ ఉంటుంది మరియు ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలతో సహా ఏ కారణం చేతనైనా పాల్గొనేవారిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. రిపోర్డు చేసిన కంటెంట్ తీసివేయడానికి, Watch Parties ఫీచర్లను ఉపయోగించుకోగలిగిన మీ సమర్థతకు పరిమితి విధించడానికి, మరియు అనుచితము లేదా హానికరమని మేం భావించిన ఏదైనా ప్రవర్తన కొరకు మీ ఖాతాను సస్పెండ్ చేయడానికి లేదా పరిసమాప్తం చేయడానికి మేం హక్కు కలిగి ఉంటాము. ఇతర ఖాతాలను ఉపయోగించి సస్పెన్షన్ తప్పించుకోవడానికి చేసే ఏ ప్రయత్నం అయినా, తదుపరి సస్పెన్షన్ లేదా పరిసమాప్తికి దారితీయవచ్చు.

Amazon ఖాతాదారు అయిన మీరు, మీ ఖాతా యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్ క్రింద వ్యవహరించే ఎవ్వరిచేతనైనా ఈ మార్గదర్శకాల అనుచిత వాడకం లేదా ఉల్లంఘనకు బాధ్యులుగా ఉంటారు. మీ యూజర్‌నేమ్, పాస్వర్డ్, మరియు Watch Partiesని యాక్సెస్ చేయడానికి అవసరమైన ఏదేని ఇతర సమాచారాన్ని మీరు గోప్యమైనదిగా చూసుకోవాలి.

వ్యక్తిగత వాడకం

Watch Parties అనుభవం వ్యక్తిగత వాడకానికి ఉద్దేశించబడింది; ఏదేని ఒక వాణిజ్యపరమైన ఉద్దేశ్యము కొరకు Watch Parties వాడకం నిషేధించబడింది.

కమ్యూనిటీ అనుభవం

Watch Partiesకి ఆతిథ్యమిచ్చేవారు Watch Party సమయంలో ప్లేబ్యాక్ ని నియంత్రిస్తారు. మీరు ఏ సమయములోనైనా Watch Parties అనుభవం నుండి నిష్క్రమించవచ్చు, అనుభవాన్ని ఎక్కడి నుండి వదిలేశారో అక్కడి నుండి తీసుకోవచ్చు.

Watch Parties లో చేరడం

Watch Parties హోస్ట్ ద్వారా మీకు అధికారం ఇచ్చినట్లయితే తప్ప Watch Parties ఆహ్వానాన్ని ఇతరులతో తిరిగి-పంచుకోవద్దు. Watch Parties హోస్ట్ కాకుండా ఇతర వ్యక్తుల నుండి ఆహ్వానం అందుకున్న వారితో సహా, ఆహ్వానం స్వీకరించిన వారందరూ Watch Party లో చేరి మరియు పాల్గొనగలరు.

మీ Watch Parties అనుభవాన్ని పంచుకోవడానికి ఇతరులను ఆహ్వానించడానికై మీరు సోషల్ మీడియాను ఉపయోగించడానికి వీలు కల్పించే ఫీచర్లను మేం మీకు అందించవచ్చు. ఈ ఫీచర్లను విధిగా ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

యూజర్‌నేమ్ ఎంపిక

మీరు Watch Parties కి చేరేటప్పుడు, మీరు సమర్పించే పేరు Watch Partiesలో పాల్గొనేవారందరికీ కనిపిస్తుంటుంది. యూజర్‌నేమ్ ఎంపిక చేసుకునేటప్పుడు, మీ నిజమైన పేరును లేదా ఏదేని వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడంలో ఇమిడి ఉండే ముప్పు పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది మిమ్మల్ని తిరిగి కనుక్కొనేలా చేయవచ్చు. పేర్లు కూడా మర్యాదపూర్వకంగా ఉండాలి మరియు ఈ మార్గదర్శకాల ప్రకారము వయసుకు తగినవిగా ఉండాలి.

Watch Parties చాట్ కంటెంట్

Watch Parties చాట్ చర్చకు ఒక వేదికను అందించడానికి ఉద్దేశించబడింది. మనం ఒక Watch Party లోని సందేశాలు అన్నింటిని అంగీకరించకపోవచ్చు, అయితే మీకు అంగీకారంగా లేనిది ఏదైనా సరే ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించనట్లుగా ఉండాలని మనసులో ఉంచుకోండి. Watch Partiesలో మీరు పాల్గొనేటప్పుడు ఎప్పుడూ ఇతరుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి తద్వారా Watch Parties ఒక స్వాగతపూర్వక, వాణిజ్య-యేతర వేదికగా నిలుస్తుంది. మరిముఖ్యంగా:

 • ద్వేషపూరిత ప్రవర్త: ద్వేషపూరిత ప్రవర్తన అంటే జాతి, స్వజాతీయత, జాతీయ మూలం, మతం, సెక్సు, లింగం, లింగపరమైన గుర్తింపు, లైంగిక ధోరణి, వయస్సు, వికలాంగత, తీవ్ర వైద్య పరిస్థితి లేదా అనుభవజ్ఞత స్థితి ఆధారంగా వివక్షత, అప్రతిష్ట, ఆబ్జెక్టిఫికేషన్, వేధింపు లేదా హింసను పెంచే, ప్రోత్సహించే లేదా వీలుకల్పించే ఏదైనా కంటెంట్ లేదా కార్యకలాపం మరియు ఇది నిషేధించబడింది.
 • వేధింపు: వేధింపు అంటే ఇతరులను భయపెట్టడానికి, తక్కువ చేయడానికి, దూషించడానికి లేదా బెదించడానికి లేదా ఇతరులకు ప్రతికూల వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించే ఏదైనా కంటెంట్ లేదా కార్యకలాపం మరియు ఇది నిషేధించబడింది.
 • ప్రకటనలు, ప్రమోషన్లు మరియు మార్కెటింగ్: ఏవైనా కంటెంట్, ఉత్పత్తులు లేదా సర్వీసుల ప్రకటనలు, ప్రమోషన్లు మరియు మార్కెటింగ్ నిషేధించబడ్డాయి.
 • ప్రమాదకరమైన లేదా చట్టవ్యతిరేక కంటెంట్: వీక్షకున్ని అక్రమ, ప్రమాదకరం లేదా హానికరమైన చర్యలకుప్రోత్సహించే, ఆమోదించే లేదా రెచ్చగొట్టే చాట్ కంటెంట్ నిషేధించబడింది.
 • వయస్సుకు తగిన చాట్: చాటింగ్ మీరు ఒక గ్రూపుగా చూస్తున్న శీర్షిక వయస్సు శ్రేణికి తగినట్లుగా ఉండాలి. ఒక శీర్షిక ప్రేక్షకులందరి కోసం ఉద్దేశించబడితే, చాట్ కూడా కుటుంబం-స్నేహపూర్వక రేటింగును ప్రతిఫలించాలి.
 • లైంగికంగా స్పష్టమైన చాట్: లైంగిక లేదా అమర్యాదపూర్వక చర్యలను కీర్తించే లేదా వర్ణించే లేదా రెచ్చగొట్టే లేదా లైంగికపరమైన లేదా అమర్యాదపూర్వక ప్రతిస్పందనను వెలిబుచ్చడానికి ఉద్దేశించిన చాట్ కంటెంట్ ఇతరులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు మరియు నిషేధించబడింది.

మీరు పంచుకునే ఏదేని కంటెంట్ కు సంబంధించి ఎలాంటి గోప్యతకు మేం హామీ ఇవ్వలేం. మీరు మీ స్వంత కంటెంట్ మరియు చాట్ లో పాల్గొన్న పర్యవసానాలకూ మీరే పూర్తిగా బాధ్యులుగా ఉంటారు. Watch Parties లో పంచుకునే ఏదైనా కంటెంట్, అభిప్రాయం, సిఫారసు లేదా సలహాను మేం ఇవ్వం లేదా మంజూరు చేయం మరియు అట్టి కంటెంట్ కు సంబంధించిన ఏదైనా మరియు అన్ని బాధ్యతలనూ మేం వ్యక్తీకరించి అస్వీకారము చేస్తాము.

Watch Parties చాట్ చరిత్ర Watch Party జరుగుతున్నంత సమయమూ చాట్ లో పాల్గొంటున్న ఇతరులందరికీ కనిపిస్తూ ఉంటుంది. Watch Party ముగిసిన తరువాత Watch Parties చాట్ చరిత్ర సేవ్ చేయబడదు లేదా ఆతిథ్యమిచ్చినవారికి లేదా పాల్గొన్నవారు యాక్సెస్ చేసుకోలేరు.

చట్టాన్ని అతిక్రమించడం

Watch Parties ఉపయోగించునప్పుడు మీరు స్థానిక, జాతీయ, మరియు అంతర్జాతీయ చట్టాలను అన్నింటినీ విధిగా గౌరవించాలి.

ప్రైవేటు సమాచారమును అనధికారికంగా కోరడం లేదా పంచుకోవడం

ఇతరుల గోప్యత మీద దాడి చేయవద్దు. అనుమతి లేకుండా, వ్యక్తులు, లేదా వారి ప్రైవేటు ఆస్తుల గురించిన వ్యక్తిగత సమాచారమును వెల్లడించే కంటెంట్ పంచుకోవడం నిషిద్ధం. ఇందులో దిగువ పేర్కొన్నవాటికే పరిమితం కాకుండా ఉంటాయి:

 • వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారాన్ని పంచుకోవడం (నిజమైన పేరు, స్థానము లేదా ID వంటివి)
 • నిర్బంధిత లేదా రక్షించబడిన సామాజిక ప్రొఫైల్స్ లేదా ఆ ప్రొఫైల్స్ నుండి ఏదైనా సమాచారమును పంచుకొనుట
 • Watch Parties చాట్ విషయాంశమును ఇతర Watch Parties లో పాల్గొన్నవారి గురించిన స్క్రీన్ షాట్లు లేదా సమాచారమునకే పరిమితం కాకుండా వాటితో సహా ఏదేని తృతీయపక్షంతో పంచుకోవడం
 • వ్యక్తిగతంగా గుర్తించే సమాచారం (నిజమైన పేరు, స్థానము లేదా ID వంటివి) ను ఇతర Watch Parties లో పాల్గొన్నవారినుండి కోరడం
 • వాణిజ్యపరమైన ఆవశ్యకతల కొరకు వ్యక్తిగత సమాచారమును కోరుట

మరొకరిగా వ్యవహరించడం

ఒక వ్యక్తిని లేదా సంస్థగా నటించేందుకు ఉద్దేశించిన కంటెంట్ లేదా చర్య నిషేధించబడింది, ప్రత్యేకించి మీరు Amazon లేదా Prime Video వలే నటించాలనాి అనుకున్నట్లయితే.

స్పామ్, స్కామ్‌లు మరియు ఇతర హానికరమైన ప్రవర్తన

Watch Parties సమగ్రతకు లేదా మరొక వాడుకదారు అనుభవము లేదా ఉపకరణానికి ఇబ్బంది కలిగించే, ఆటంకపరచే, హాని చేసే లేదా ఇతరత్రా ఉల్లంఘించే ఏదేని కంటెంట్ లేదా చర్య నిషేధించబడింది. అటువంటి కార్యకలాపాలలో ఇవి చేరి ఉంటాయి:

 • పునరావృతమైన, అవాంఛితమైన సందేశాలను భారీ మొత్తములో పోస్టు చేయుట
 • ఫిషింగ్
 • ఇతరులను మోసగించుట
 • మాల్‌వేర్, వైరస్ లు లేదా అనుచితమైన లేదా హానికరమైన కంటెంట్ వ్యాప్తి చేయడం
 • తప్పు సమాచారము (బాధను కలిగించేది, తప్పుదారి పట్టించే మెటాడేటాను పోస్టు చేయడం, లేదా ఉద్దేశ్యపూర్వకంగా కంటెంట్ తప్పుగా చూపుట)
 • వాడుకదారు ఖాతాలను విక్రయించుట లేదా పంచుకోవడం
 • Watch Parties పై ఏదైనా మెటీరియల్ పర్యవేక్షించడం లేదా కాపీ చేయడం, డేటా మైనింగ్, డేటా హార్వెస్టింగ్, డేటా తీసుకోవడం, లేదా అటువంటి చర్య ఏదైనా వాటితో సహా Watch Parties ని ఏదైనా ఆవశ్యకత కొరకు ప్రాప్యత చేసుకోవడానికి ఏదైనా ఆటోమేటిక్ ఉపకరణం లేదా మార్గాన్ని ఉపయోగించడం
 • Watch Parties లేదా ఏదైనా సర్వర్, కంప్యూటర్ లేదా Watch Parties కు అనుసంధానించిన డేటాబేస్ ఏవేని భాగాలను అనధికారికంగా ప్రాప్యత చేసుకోవడానికి, తప్పించుటకు, వాటితో జోక్యానికి, పాడు చేయడానికి లేదా ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నిస్తుంది.