సైన్ ఇన్

సహాయం

సమస్య పరిష్కార ప్రక్రియ

ఫ్రెంచ్ ఓపెన్ - రోలాండ్-గారోస్ సపోర్ట్

Prime Videoలో ఫ్రెంచ్ ఓపెన్ - రోలాండ్-గారోస్ లైవ్ కవరేజీని చూడటంలో సమస్యలు ఉంటే మీరు ఇలా చేయవచ్చు.

ప్రశ్నలు & సమాధానాలు

1) Prime Videoలో రోలాండ్-గారోస్‌ను చూడటం కోసం నేను అదనంగా చెల్లించాలా?

మెట్రోపాలిటన్ ఫ్రాన్స్ మరియు కార్సికాలోని Prime సభ్యులు రోలాండ్-గారోస్ మ్యాచ్‌లను Prime Videoలో అదనపు రుసుము లేకుండా చూడవచ్చు. Prime సభ్యులు కానివారు Prime యొక్క 30 రోజుల ఉచిత ట్రయల్‌ను ప్రారంభించవచ్చు (ఉచిత ట్రయల్ తర్వాత €49/సంవత్సరం లేదా €5.99/నెల). మరింత సమాచారం కోసం, ఈ లింక్‌ను సందర్శించండి: www.amazon.fr/prime

ఆండ్రోరా మరియు సెయింట్-బర్తేలెమీ మినహా ఫ్రెంచ్ విదేశీ విభాగాలు, ప్రాంతాలు మరియు కమ్యూనిటీలు (DROM-COM)లోని Prime Video-మాత్రమే సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్‌లు Prime Videoలో రోలాండ్-గారోస్ మ్యాచ్‌లను అదనపు రుసుములు లేకుండా చూడవచ్చు. Prime Video మాత్రమే సబ్‌స్క్రిప్షన్ లేని కస్టమర్‌లు 7 రోజుల ఉచిత ట్రయల్ (ఉచిత ట్రయల్ తర్వాత €5.99 లేదా $5.99)ను ప్రారంభించవచ్చు.

2) Prime Videoలో ఏ రోలాండ్-గారోస్ మ్యాచ్‌లు అందుబాటులో ఉంటాయి? నేను రోలాండ్-గారోస్ నుండి ఎంచుకున్న మ్యాచ్‌లను మాత్రమే చూడగలుగుతున్నాను, మొత్తం టోర్నమెంట్‌ను ఎందుకు చూడలేకపోతున్నాను?

ప్రధాన డ్రా (05/31) (రెండు క్వార్టర్‌ఫైనల్ రాత్రి మ్యాచ్‌లతో సహా), మరియు సైమోనే-మాథ్యూ (SM) కోర్ట్‌లో (05/30 మొదలు) మొదటి సోమవారం ప్రారంభమయ్యే అన్ని కొత్త (10) రాత్రి సెషన్ మ్యాచ్‌లను (21:00 CET) ప్రసారం చేయడానికి Prime Video హక్కులను పొందింది. నైట్ మ్యాచ్‌లు ఐకానిక్ రోలాండ్-గారోస్ గ్రాండ్ స్లామ్‌కు కొత్తగా జోడించబడినవి, ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఆ రోజుకు ఉత్తమ సింగిల్స్ మ్యాచ్ వాలే ఉంటున్నాయి (పురుషులు లేదా మహిళలు). పురుషుల, మహిళల సింగిల్స్ మరియు డబుల్స్ కాంపిటీషన్ యొక్క సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్స్‌కు Prime Video ప్రత్యేక సహకార హక్కులను కలిగి ఉంది. మే 2021 నుంచి మొదలుకొని 2023 ముగింపు వరకు తదుపరి మూడు సంవత్సరాలకు Prime Video ఈ హక్కులను పొందింది.

3) నేను ఏ డివైజ్‌లోనైనా రోలాండ్-గరోస్ లైవ్ ప్రసారాన్ని చేయవచ్చా? Prime Videoలో లైవ్ ప్రసారాన్ని ఏ డివైజ్‌లు సపోర్ట్ చేయవు?

సాధారణ మార్గదర్శకాల కోసం, దయచేసి ఈ పేజీని రెఫర్ చేయండి. వెబ్ బ్రౌజర్‌లు మరియు కనెక్ట్ చేసిన డివైజ్‌లలో Prime Video యాప్ ద్వారా Fire TV మరియు Fire టాబ్లెట్ వంటి Amazon డివైజ్‌లతో పాటు, గేమ్‌ల కన్సోల్‌లు (PS3, PS4, Xbox One), సెట్ టాప్ బాక్స్‌లు మరియు మీడియా ప్లేయర్‌లు (Google Chromecast, Bouygues, SFR, Free, Orange, Apple TV 4K మరియు Apple TV (3వ మరియు 4వ జెనెరేషన్‌లు) వంటివి, స్మార్ట్ TVలు, బ్లూ-రే ప్లేయర్‌లు, iOS లేదా Android టాబ్లెట్‌లు మరియు తాజా వెర్షన్ Prime Video యాప్‌ను కలిగి ఉన్న మొబైల్ ఫోన్‌లు వంటి వాటిలో లైవ్ స్పోర్ట్‌కు సపోర్ట్ ఉంటుంది.

Prime Videoలో లైవ్ స్ట్రీమింగ్‌కు కింద పేర్కొన్న డివైజ్‌లు సపోర్ట్ చేయవు, కాబట్టి మీరు ఈ కింద పేర్కొన్న డివైజ్‌లలో రోలాండ్-గారోస్‌ను చూడలేరు:
 • Sony Bravia TV: కొన్ని 2015 మరియు అంతకుముందు Bravia TVలు
 • Sony Bravia బ్లూ-రే: Bravia బ్లూ-రే డిస్క్ ప్లేయర్
 • Microsoft Xbox 360
 • Nintendo Wii మరియు Wii U
 • LG Hawaii TV: కొన్ని 2015 మరియు అంతకుముందు LG TVలు
 • మొదటిలోని Roku డివైజ్‌లు: 2014 మరియు అంతకుముందు Roku డిమైజ్‌లు (Roku 3 మినహా, దానికి సపోర్ట్ ఉన్నవి).
 • Vizio Mediatek 2014: 2014 Vizio TV
 • TiVo సిరీస్ 4/5/మినీ
 • Panasonic TV: Panasonic Viera స్మార్ట్ TV
 • Panasonic Viera బ్లూ-రే ప్లేయర్
 • Loewe Sigma TV
 • Sharp MTK 5655 TV

4) నేను Prime Videoలో రోలాండ్-గరోస్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లను చూడవచ్చా?

2021లో, Prime Video యొక్క రోలాండ్ గారోస్ కవరేజ్ ప్రధాన పోటీ (మే 30)తో ప్రారంభమవుతుంది.

5) Prime Video,పగలు మరియు రాత్రి సెషన్ మ్యాచ్‌లను లైవ్ ప్రసారం చేసి, వాటిని రీప్లే కోసం అందుబాటులో ఉంచుతుందా?

అవును. సైమోన్నే-మాథ్యూ (SM) కోర్ట్‌లో మరియు అన్ని 10 నైట్ సెషన్ మ్యాచ్‌లలో ఆడవలసిన మ్యాచ్‌లను ప్రసారం (43) చేయడానికి Prime Video ప్రత్యేకమైన యాక్సెస్‌ను కలిగి ఉంది. మ్యాచ్ ముగిసిన తర్వాత పూర్తి మ్యాచ్ రీప్లేలు కూడా అందుబాటులో ఉంటాయి.

6) Prime Video, ప్రతి రాత్రి సెషన్ కోసం ఏ మ్యాచ్ ప్రసారం చేస్తుందో నేను ఎలా తెలుసుకోగలను?

Prime Video, ప్రతి రోజు ఆట ప్రారంభంలో టోర్నమెంట్ పేజీ ద్వారా నిర్ధారించబడిన మ్యాచ్ షెడ్యూల్‌లను ప్రచురిస్తుంది. మొదటి రాత్రి మ్యాచ్ 05/31 (21:00 CEST) నుండి ప్రారంభం కావాల్సి ఉంది.

7) నేను Prime Video యొక్క రోలాండ్-గారోస్ మ్యాచ్‌లను క్లబ్‌లు లేదా రెస్టారెంట్‌లలో చూడవచ్చా?

Prime Videoలో రోలాండ్-గారోస్ ప్రసారం, ప్రైవేట్ మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

8) Prime Videoలో రోలాండ్ గారోస్ మ్యాచ్‌ల కోసం నేను ఎలా వెతకాలి?

Prime సభ్యులు, “లైవ్ మరియు రాబోయే” కరోసెల్ మరియు వారి Prime Video హోమ్ స్క్రీన్‌లో అందుబాటులో ఉన్న బ్యానర్‌ల ద్వారా మ్యాచ్‌ల లైవ్ కవరేజ్‌ను యాక్సెస్ చేయగలుగుతారు.

9) Prime Videoలో ఈ మ్యాచ్‌లకు ఏ/ఏమేమి వీడియో రిజల్యూషన్ (లు) అందుబాటులో ఉంటుంది/ఉంటాయి?

రోలాండ్-గారోస్ మ్యాచ్‌లు హై డెఫినిషన్ (HD)లో అందుబాటులో ఉంటాయి. Prime Videoలో అందుబాటులో ఉన్న బ్యాండ్‌విడ్త్ వేగం ఆధారంగా అత్యంత ఎక్కువ నాణ్యత ఉన్న స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

10) నా iOS లేదా Android మొబైల్ డివైజ్‌లో లైవ్ స్పోర్ట్స్‌ను నేను ఎందుకు చూడలేను?

మీరు మీ iOS లేదా Android మొబైల్ పరికరంలో లైవ్ స్పోర్ట్‌ను యాక్సెస్ చెయ్యలేకపోతే, దయచేసి మీ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి. Android వినియోగదారులు: Google Play స్టోర్ యాప్‌ను తెరిచి, "Prime Video"ను వెతికి, "అప్‌డేట్ చేయి"ని ట్యాప్ చేయండి. iOS వినియోగదారులు ఈ విధంగా చేయండి: యాప్ స్టోర్‌ను తెరిచి, "Prime Video"ను వెతికి, "అప్‌డేట్ చేయి"ని ట్యాప్ చేయండి.

11) రోలాండ్ గారోస్ కవరేజ్‌ను చూడటానికి ప్రయత్నించినప్పుడు నేను ఒక స్థాన లోపాన్ని పొందుతున్నాను.

రోలాండ్-గారోస్ మ్యాచ్‌లు, మెట్రోపాలిటన్ ఫ్రాన్స్ మరియు మొనాకోలలో ఉన్న Prime కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆండ్రోరాలోని మరియు ఫ్రెంచ్ విదేశీ విభాగాలు, ప్రాంతాలు మరియు కమ్యూనిటీల (DROM-COM)లోని Prime Video సబ్‌స్క్రిప్షన్ కస్టమర్‌లు కూడా ఈ మ్యాచ్‌లను యాక్సెస్ చేయవచ్చు. సెయింట్ బర్తేలెమీ సహా అన్ని ఇతర అంతర్జాతీయ స్థానాలకు అర్హత లేదు.

12) నా ప్రసారం ఆలస్యం అయింది, నేను దీన్ని ఎలా తగ్గించాలి?

లైవ్ ఆట మరియు వీక్షకుల ప్రసార అనుభవం మధ్య ఎల్లప్పుడూ సంక్షిప్త ఆలస్యం ఉండవచ్చు, అది మీరు ఉపయోగిస్తున్న డివైజ్ యొక్క రకం మీద ఆధారపడి ఉంటుంది. మేము ఒక Fire TV, Apple TV, iOS లేదా Android డివైజ్‌ను ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నాము.

13) నేను ప్రసారం చేస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి, నేను ఏమి చేయాలి?

ఉత్తమ లైవ్ స్ట్రీమింగ్ అనుభవం కోసం, Prime Videoకి SD కోసం కనీసం 1 Mbps & HD కోసం కనీసం 5 Mbps ఉండాలి. Prime Videoలో అందుబాటులో ఉన్న బ్యాండ్‌విడ్త్ వేగం ఆధారంగా అత్యంత ఎక్కువ నాణ్యత ఉన్న స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
గమనిక: మీకు వీడియో "జడ్డరింగ్" సమస్యలు ఉంటే లేదా మోషన్ ఎక్కువ అస్పష్టంగా ఉంటే, మీ టీవీలో మోషన్ సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి. మీ టీవీ తయారీదారు బట్టి ఈ సెట్టింగ్‌కు మరొక పేరు ఉండవచ్చు. ఆటో మోషన్ ప్లస్, ట్రు మోషన్, మోషన్ ఫ్లో, సినీ మోషన్, మోషన్ పిక్చర్ వంటివి మోషన్ సెట్టింగ్‌లలో కొన్ని ఉదాహరణలు.