Prime Video టైటిల్‌లను ప్లే చేసే సమయంలో సమస్యలు
Prime Video టైటిల్లు ప్లే కానప్పుడు లేదా మీకు 1007, 1022, 7003, 7005, 7031, 7135, 7202, 7203, 7204, 7206, 7207, 7230, 7250, 7251, 7301, 7303, 7305, 7306, 8020, 9003, 9074 వంటి ఎర్రర్ కోడ్లు కనిపించినప్పుడు మీరు ఏమి చేయాలి.
- మీ డివైజ్‌లో ఉన్న Prime Video యాప్‌ను (లేదా మీ కంప్యూటర్ నుండి చూస్తుంటే మీ వెబ్ బ్రౌజర్‌ను) మూసివేసి, దానిని పునఃప్రారంభించండి.
- మీ డివైజ్ లేదా వెబ్ బ్రౌజర్లో తాజా అప్డేట్లు ఉన్నట్లు నిర్ధారించుకోండి.
- మీరు ఒకే ఖాతాను మల్టిపుల్ డివైజ్‌లలో ఉపయోగించకూడదు - మీరు ఒక సమయంలో ఒక టైటిల్‌ను రెండు డివైజ్‌లలో మాత్రమే ప్రసారం చేయగలరు.
- మీ టీవీకి లేదా డిస్ప్లేకి HDMIతో కనెక్ట్ చేసిన బాహ్య డివైజ్‌లో HDCP 1.4 (HD కంటెంట్ కోసం), HDCP 2.2 (UHD మరియు/లేదా HDR కంటెంట్ కోసం) సామర్థ్యం ఉన్నట్లు నిర్ధారించుకోండి.
- వేరే ఇంటర్నెట్ కార్యకలాపాన్ని పాజ్ చేయండి, ప్రత్యేకించి ఇతర డివైజ్‌లు కూడా ఒకే సమయంలో నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నప్పుడు.
- మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను తనిఖీ చేయండి.
- మీరు ఇంటర్నెట్కు లేదా వేరే డివైజ్‌లకు కనెక్ట్ చేయగలిగితే, మీరు కనెక్ట్ చేసిన డివైజ్ యొక్క DNS సెట్టింగ్‌లను అప్డేట్ చేయండి. దీనిని ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మీ డివైజ్ తయారీదారు ఇచ్చిన సూచనలను చూడండి.
- VPN లేదా ప్రాక్సీ సర్వర్లను నిలిపివేయండి.