Prime Video
  1. మీ ఖాతా

సహాయం

కంటెంట్ విధాన మార్గదర్శకాలు

అన్ని వీడియోలు మరియు ఇతర కంటెంట్ (కవర్ చిత్రం మరియు ఉత్పత్తి వివరణలు వంటివి) తప్పక ఈ కంటెంట్ విధాన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి, ఈ మార్గదర్శకాలు భవిష్యత్తులో మారవచ్చు. కంటెంట్ సముచితంగా ఉందో లేదో నిర్ణయించగల హక్కు మాకు ఉంది. ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడం కోసం, మేము ఏదైనా కంటెంట్‌ను నియంత్రించవచ్చు లేదా దాని లభ్యతను పరిమితం చేయవచ్చు.

అభ్యంతరకరమైన కంటెంట్

సేవలో ప్రచురించడం కోసం సమర్పించిన మొత్తం కంటెంట్ సముచితంగా ఉందో లేదో నిర్ణయించగల హక్కు మాకు ఉంది. లైంగికంగా అభ్యంతరకరమైన లేదా హింసాత్మకమైన ప్రత్యక్ష లేదా గ్రాఫిక్ చర్యలు, అభ్యంతరకరమైన నగ్నత్వం మరియు/లేదా లైంగికంగా రెచ్చగొట్టే దృశ్యాలు ("పెద్దల కంటెంట్") ఉన్న టైటిల్‌లను Amazon Prime Video కేటలాగ్‌లో ఉంచలేరు. ఈ నియమాన్ని తప్పించుకోవడం కోసం పెద్దల కంటెంట్ ఉన్న టైటిల్‌ల యొక్క అసలు వెర్షన్‌లో మార్పులు లేదా సవరణలు చేయలేకపోవచ్చు.

లైంగికంగా అభ్యంతరకరమైన కంటెంట్

  • అశ్లీలత లేదా లైంగిక చర్యలు లేదా నగ్నత్వాన్ని చిత్రీకరించిన కంటెంట్.
  • చట్టవ్యతిరేకమైన లైంగిక చర్యలను కలిగిన కంటెంట్.
  • ప్రాథమికంగా లైంగికంగా రొచ్చగొట్టే విధంగా ఉన్న కంటెంట్.

హింసాత్మకం లేదా గ్రాఫిక్ కంటెంట్

  • కస్టమర్‌ను షాక్‌కు గురిచేయడం కోసం చిత్రీకరించిన అత్యంత జుగుప్సాకరమైన, ఇబ్బందికరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ మరియు/లేదా అత్యంత హింసాత్మకమైన గ్రాఫిక్‌ను కలిగిన కంటెంట్.

హానికరమైన లేదా చట్టవ్యతిరేకమైన కంటెంట్

  • హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలను చేసేలా విధంగా వీక్షకులను ప్రోత్సహించే, రొచ్చగొట్టే లేదా ప్రదర్శించే కంటెంట్.
  • ప్రణాళికాబద్ధంగా జరిగే నేరం, ఉగ్రవాదం లేదా ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలను కలిగిన కంటెంట్.
  • జంతువుల పట్ల చట్టవ్యతిరేకమైన చర్యలు లేదా వేధింపులను అందంగా చూపించే లేదా వాటికి మద్దతిచ్చే కంటెంట్.
  • చట్టవ్యతిరేకమైన జీవనవిధానాన్ని ఎలా ప్రారంభించాలి లేదా కొనసాగించాలి అని సలహాలిచ్చే కంటెంట్.
  • ప్రమాదకరమైన వస్తువులను తయారు చేయడం లేదా రూపొందించడంలో శిక్షణ ఇచ్చే కంటెంట్.
  • చట్టవ్యతిరేకమైన లేదా నిషేధిత మత్తపదార్థాల వినియోగానికి మద్దతిచ్చే లేదా దానిని ప్రచారం చేసే కంటెంట్.

ద్వేషపూరిత కంటెంట్

  • ఏదైనా సమూహం లేదా వ్యక్తులను లక్ష్యంగా చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగం లేదా హానులను కలిగిన కంటెంట్.
  • ద్వేషపూరిత ప్రసంగాన్ని కలిగిన, జాతి లేదా లింగ వ్యతిరేకతను కలిగిన లేదా అటువంటి భావాలను కలిగిన సమూహాలు లేదా సంస్థలను ప్రచారం చేసే కంటెంట్.

వేధింపులు మరియు సైబర్ బెదిరింపులు

  • అభ్యంతరకరమైన, ఇబ్బందికరమైన మరియు/లేదా అవమానకరమైన భాషను కలిగిన కంటెంట్.
  • స్టాకింగ్ లేదా ఇంటిమిడేషన్‌ను ప్రచారం చేసే లేదా కలిగి ఉన్న కంటెంట్.
  • సమ్మతి లేకుండా తీసిన వీడియోతో పాటు మోసపూరితమైన లేదా వేధింపులను కలిగిన వీడియో కంటెంట్.

చట్టవ్యతిరేకమైన మరియు ఉల్లంఘన కంటెంట్

చట్టపరమైన మరియు ఆస్తిపరమైన హక్కుల ఉల్లంఘనలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము. కంటెంట్‌లో చట్టాలు లేదా కాపీరైట్, వ్యాపారచిహ్నం, గోప్యత, ప్రచారం లేదా ఇతర హక్కుల (నేపథ్య సంగీతం లేదా కంటెంట్‌లో ప్రదర్శించబడిన అంశాలు వంటి వాటితో పాటు కంటెంట్‌లోని వివిధ భాగాలతో సహా) ఉల్లంఘన లేకుండా చూసుకోవలసిన బాధ్యత లైసెన్సర్‌పై ఉంటుంది. కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉన్నంత మాత్రాన దానిని లైసెన్సర్ కాపీ చేసి, విక్రయించవచ్చని అర్థం కాదు.

కాపీరైట్

  • మీరు సృష్టించిన తర్వాత లేదా లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే సంగీతం లేదా చిత్రాలతో వంటి వాటిని పూర్తిగా లేదా భాగాలుగా ఉపయోగించండి.

వ్యాపారచిహ్నాలు

  • ఉపయోగించడానికి మీకు హక్కులు లేని వ్యాపారచిహ్నాలను కలిగిన కంటెంట్.

గోప్యతా ఉల్లంఘనలు లేదా అవమానించడం

  • ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని కలిగిన కంటెంట్.
  • వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వారి గురించి అవాస్తవ ప్రకటనలను కలిగిన కంటెంట్.

పబ్లిక్ డొమైన్ కంటెంట్

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శీర్షికలతో అస్సలు తేడా లేని లేదా చాలా తక్కువ తేడా ఉన్న పబ్లిక్ డొమైన కంటెంట్ లేదా కంటెంట్‌ను మేము ఆమోదించము.

కస్టమర్‌కు ఇబ్బందికరమైన అనుభవం

బాహ్య లింక్‌లు, ట్రాకింగ్ ట్యాగ్‌లు, Prime Video మద్దతివ్వని విధులను కలిగిన లేదా కస్టమర్‌కు ఇబ్బందికరమైన అనుభవాన్ని అందించే వీడియోలను మేము ఆమోదించము. కస్టమర్‌కు మంచి అనుభవాన్ని అందించలేవు అని మాకు అనిపించిన ఏ వీడియోలను అయిన ఆమోదించగల లేదా తిరస్కరించగల హక్కు మాకు ఉంది.

నాణ్యతలో సమస్యలు

  • ఆడియో మరియు వీడియో వ్యవధులు వేర్వేరుగా ఉన్న సోర్స్ ఫైల్‌ను కలిగిన కంటెంట్.
  • శీర్షిక పేరు లేకుండా కవర్ చిత్రాన్ని కలిగిన కంటెంట్.
  • శీర్షికలు లేని, సమకాలీకరణలో లేని లేదా తప్పుగా ఉన్న కంటెంట్.
  • సంబంధం లేని పంపిణీ ఛానెల్‌కు వాటర్‌మార్క్‌లు, లోగోలు లేదా సూచనలను కలిగిన కంటెంట్.
  • Prime Video అప్లికేషన్‌లో మద్దతు లేని విధులు లేదా కాల్-టు-యాక్షన్.
  • కంటెంట్‌ను తప్పుగా చూపుతున్న మెటాడేటా మరియు/లేదా కవర్ చిత్రాలు.
  • మద్దతు లేని భాషలో ఉన్న కంటెంట్ లేదా మెటాడేటా.
  • ఇప్పటికే Prime Videoలో ఉన్న ఒక శీర్షికకు నకలుగా రూపొందించిన కంటెంట్.
  • వీడియో అనుభవంపై ఆధారపడని (ఉదా. చలనం లేని చిత్రము(లు) ఉన్న కంటెంట్ మరియు/లేదా గణనీయమైన విజువల్ వేరియేషన్ లేని కంటెంట్) కంటెంట్.
  • ఓపెన్/పబ్లిక్ కాపీరైట్‌లను కలిగిన కంటెంట్‌తో పాటు వెబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న కంటెంట్.

వ్యాపార ప్రచారం మరియు బాహ్య లింక్‌లు

  • Amazonతో భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొనే లేదా Amazon లోగో లేదా Amazon బ్రాండెండ్ ఉత్పత్తితో (ఉత్పత్తులతో) పాటు Amazon ఉప-సంస్థలతో సంబంధం ఉన్నట్లు పేర్కొనే కంటెంట్.
  • Prime Video అప్లికేషన్ వెలుపల చర్యలు తీసుకునే విధంగా ఉన్న URL, బాహ్య లింక్ లేదా చర్యను కలిగిన కంటెంట్.
  • వ్యాపార ప్రకటనను కలిగిన లేదా కేవలం వ్యాపార ప్రకటనల కోసమే రూపొందించిన కంటెంట్.
  • కస్టమర్‌లను గందరగోళానికి గురిచేసే విధంగా మరో పార్టీ యొక్క బ్రాండ్‌ను తప్పుగా పేర్కొనే, దుర్వినియోగం చేసే, అనుబంధం ఉన్నట్లు పేర్కొనే లేదా ఉపయోగించే కంటెంట్.

దేశం లేదా ప్రాంతానికి పరిమితమైన నియమాలు

మేము కంటెంట్‌ను పంపిణీ చేసే కొన్ని దేశాలలో "అభ్యంతరకరమైన కంటెంట్,"" లేదా "చట్టవ్యతిరేకమైన మరియు ఉల్లంఘన కంటెంట్" గుర్తింపు ప్రమాణాలు ఇతర దేశాల కంటే మరింత కఠినంగా ఉండవచ్చు. పొగాకు మరియు మత్తుపదార్థాల వినియోగం; అభ్యంతరకరమైన, చట్టవ్యతిరేకమైన లేదా ఉల్లంఘనలను కలిగిన చిత్రీకరణలను నిర్దిష్ట ప్రాంతాలలో ప్రచురించలేకపోవడం వంటివి ఇందులో ఉండవచ్చు.

ఏదైనా ఒక శీర్షిక ఒక దేశం లేదా ప్రాంతంలోని చట్టాలు, సంస్కృతి లేదా సున్నితమైన భావాలను ఉల్లంఘిస్తందని మేము భావించినప్పుడు లేదా మా స్వీయ నిర్ణయానుసారం మేము ఆ దేశం లేదా ప్రాంతంలో ఆ శీర్షికను నియంత్రించవచ్చు.