సహాయం

సమస్య పరిష్కార ప్రక్రియ

Prime Video ఎర్రర్ 7235తో సమస్యలు

మీకు Prime Videoలో ఎర్రర్ కోడ్ 7235 కనిపిస్తే ఏమి చేయాలి.

  1. మీ డెస్క్‌టాప్ కోసం Chrome వెబ్ బ్రౌజర్ పూర్తిగా తాజాగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. సెట్టింగ్‌లు > Chrome గురించి నుండి బ్రౌజర్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయేమో చూడండి.
    అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటే, వాటిని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలని మీకు ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది.
  2. మీ Chrome వెబ్ బ్రౌజర్ చిరునామా బార్‌లో chrome://components టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
    Widevine Content Decryption Moduleలో “అప్‌డేట్ కోసం తనిఖీ చేయండి”ని క్లిక్ చేసి, అప్‌డేట్‌లు ఏవైనా ఉంటే ఇన్‌స్టాల్ చేయండి.

మీ Chrome వెబ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడం కుదరకపోతే, ఈ కింది దశలు కూడా సహాయపడవచ్చు:

  • Google Chrome మెనును తెరవండి (మూడు చుక్కల చిహ్నం.)
  • “సెట్టింగ్‌లు”ను ఎంపిక చేయండి.
  • మెనులో, “భద్రత మరియు గోప్యత”ను ఎంపిక చేయండి.
  • “సైట్ సెట్టింగ్‌ల”ను ఎంపిక చేయండి.
  • కిందికి స్క్రోల్ చేసి, “అదనపు కంటెంట్ సెట్టింగ్‌ల”ను ఎంపిక చేయండి.
  • “రక్షిత కంటెంట్ IDల”ను ఎంపిక చేయండి.
  • “సైట్‌లు రక్షిత కంటెంట్‌ను ప్లే చేయగలవు” మరియు “సైట్‌లు ఐడెంటిఫైయర్‌లను వినియోగించగలవు” అనేవి రెండింటిని కూడా ఎంపిక చేసి ఉన్నాయని నిర్ధారించుకోండి, ఆపై మీ వెబ్ బ్రౌజర్‌ను పునఃప్రారంభించండి.

సంబంధిత సహాయ అంశాలు